Foot Health : పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

శరీరం ఇచ్చే కొన్ని హెచ్చరిక సందేశాలను మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ కొన్ని లక్షణాలు పదే పదే కనిపిస్తే, వాటిని నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం అని మర్చిపోకూడదు.

Update: 2025-10-18 10:30 GMT

Foot Health : పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Foot Health : శరీరం ఇచ్చే కొన్ని హెచ్చరిక సందేశాలను మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ కొన్ని లక్షణాలు పదే పదే కనిపిస్తే, వాటిని నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం అని మర్చిపోకూడదు. ఏ వ్యాధి అయినా ఒక్కసారిగా వచ్చి మనల్ని అటాక్ చేయదు. బదులుగా అది అనేక సూచనలను, కొన్ని రకాల సందేశాలను ఇస్తుంది. కానీ వాటిని సరిగ్గా అర్థం చేసుకునే విచక్షణ మనకు ఉండాలి. అందుకే శరీరంలో ఎలాంటి మార్పులు జరిగినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా అవి ఎందుకు వస్తున్నాయి, వాటికి కారణాలు ఏమిటి అని తెలుసుకోవాలి. ఇదే విధంగా మన శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోతే, అది ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. ఇలా రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు మన పాదాలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

పాదాలలో వాపు, బరువు

సాధారణంగా సాయంత్రం అయ్యేసరికి లేదా ఎక్కువసేపు నిలబడి ఉన్నప్పుడు మీ పాదాలు, కాళ్ళు వాపుకు గురైతే, అది శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగడం లేదనే సంకేతం. వైద్య పరిభాషలో దీనిని ఎడిమా అని అంటారు. రక్త ప్రసరణ సరిగా జరుగకపోవడం కారణంగా, రక్తం, ఇతర ద్రవాలు పాదాలలో నిలిచిపోతాయి. ఇవి బరువుగా అనిపించడంతో పాటు వాపుకు దారితీస్తాయి. కొన్నిసార్లు బిగుతుగా ఉండే చెప్పులు లేదా బూట్లు ధరించడం వల్ల కూడా రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడవచ్చు.

కాలి నొప్పి, తిమ్మిర్లు

నడిచేటప్పుడు లేదా రాత్రి నిద్రపోయే సమయంలో కాళ్ళలో నొప్పి, తిమ్మిర్లు పట్టడం లేదా జలదరింపు వంటి అనుభూతులు కలుగుతుంటే, దానికి కారణం శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం కావచ్చు. రక్తనాళాలలో రక్తం సరిగా ప్రవహించనప్పుడు, కండరాలకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందవు. ఇది నొప్పి, తిమ్మిర్లకు దారితీస్తుంది. నడిచేటప్పుడు మీ కాళ్ళలో నొప్పి వచ్చి, మీరు నడవడం ఆపివేయగానే అది తగ్గితే, దానిని క్లాడికేషన్ అని అంటారు. ఇది రక్త ప్రసరణ లోపానికి ఒక సాధారణ లక్షణం.

పాదాల రంగు మారడం, గాయాలు తగ్గకపోవడం

మీ పాదాలు, ముఖ్యంగా కాలి వేళ్లు చల్లగా ఉంటే లేదా పాదాల రంగు నీలం, ఊదా లేదా ఎరుపు రంగులోకి మారితే, ఇవి రక్త ప్రసరణ సరిగా లేదనే సంకేతాలు. రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు, పాదాలకు తగినంత వేడి అందదు, అందుకే అవి చల్లగా ఉంటాయి. వీటన్నింటితో పాటు, పాదం మీద ఏదైనా గాయం తగ్గడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటే, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. గాయం నయం కావడానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు లభించకపోవడమే దీనికి కారణం.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

పైన పేర్కొన్న లక్షణాలు మీకు నిరంతరంగా కనిపిస్తే, వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోతే గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం లేదా గాంగ్రీన్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందుకే, సకాలంలో గుర్తించి దానికి తగిన మందులు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం క్షీణించకుండా రక్షించుకోవచ్చు.

Tags:    

Similar News