Milk Facts: పాలు తాగితే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!

Milk Facts: స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి పాలను ఆహారంలో చేర్చండి

Update: 2022-08-13 03:17 GMT

Milk Facts: పాలు తాగితే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!

Milk Facts: భారతీయ ఆహారంలో పాలకు చాలా ప్రాధాన్యత ఉంది. శాఖాహారులకు పాలు చాలా ముఖ్యమైనవి. దాదాపు అన్ని అవసరమైన పోషకాలు ఇందులో ఉంటాయి. అయితే బరువు తగ్గాలనుకునే వారు లేదా డైటింగ్ చేసేవారు పాలను అవైడ్ చేస్తారు. దీని వల్ల శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. అయితే పాలు తాగుతూ కూడా సులువుగా బరువు తగ్గవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి పాలను ఆహారంలో చేర్చండి. పాల ఉత్పత్తులు బరువు తగ్గడానికి సహాయపడతాయని అనేక పరిశోధనలలో వెల్లడైంది. అయితే మీరు తక్కువ కొవ్వు పాలు, దాని నుంచి తయారైన వాటిని మాత్రమే ఉపయోగించాలి. పాల ఉత్పత్తులలో కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA) ఉంటుంది. ఇది స్థూలకాయాన్ని నిరోధించే ఏజెంట్. దీంతో ఊబకాయం తగ్గుతుంది.

పాలు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం. కప్పు పాలలో దాదాపు 8.14 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ప్రొటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. హార్మోన్లు కూడా అదుపులో ఉంటాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా పాలు నివారిస్తాయి. పాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గే సమయంలో దీనిని తీసుకోవచ్చు. మీరు కొవ్వు లేని పాలతో తయారు చేసిన ఆహారపదార్థాలని తినవచ్చు. ఇలా చేస్తే మీ పొట్ట కూడా నిండుతుంది ఊబకాయం కూడా తగ్గుతుంది.

Tags:    

Similar News