Women Health Tips: ఆడవాళ్లు తప్పక తీసుకోవాల్సిన జింక్ రిచ్ ఫుడ్స్ ఇవే!
Women Health Tips: మహిళల ఆరోగ్యానికి జింక్ అత్యంత కీలకమైన మినరల్‌గా వైద్య నిపుణులు చెబుతున్నారు.
Women Health Tips: ఆడవాళ్లు తప్పక తీసుకోవాల్సిన జింక్ రిచ్ ఫుడ్స్ ఇవే!
Women Health Tips: మహిళల ఆరోగ్యానికి జింక్ అత్యంత కీలకమైన మినరల్‌గా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇమ్యూనిటీ పెంపు, హార్మోన్ల సమతుల్యత, ఎముకల బలానికి జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రోజువారీ ఆహారంలో జింక్ లోపం ఉంటే అలసట, జుట్టు రాలడం, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే జింక్ అధికంగా ఉండే ఆహారాలను డైట్‌లో తప్పక చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
జింక్ ఎందుకు ముఖ్యం?
మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు, ఇమ్యూనిటీని బలోపేతం చేయడంలో జింక్ కీలకంగా పనిచేస్తుంది. అలాగే ఎముకల ఆరోగ్యం, చర్మ సంరక్షణ, మెటబాలిజం మెరుగుదలకూ ఇది అవసరం.
నట్స్
బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా లభిస్తుంది. వీటితో పాటు హెల్దీ ఫ్యాట్స్, ప్రొటీన్స్ కూడా అందుతాయి. రోజూ చిన్న పరిమాణంలో స్నాక్స్‌లా తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
డెయిరీ ఫుడ్స్
పాలు, పెరుగు వంటి డెయిరీ పదార్థాల్లో కూడా జింక్ సమృద్ధిగా ఉంటుంది. వీటిలో ఉండే క్యాల్షియం వల్ల మహిళల్లో కీళ్ల బలహీనత సమస్యలు తగ్గుతాయి.
మిల్లెట్స్
రాగి, జొన్న, సజ్జ వంటి మిల్లెట్స్‌లో డైటరీ ఫైబర్‌తో పాటు జింక్ కూడా ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే సరిపడా జింక్ లభించడమే కాకుండా, స్థూలకాయం (ఒబెసిటీ) ప్రమాదం కూడా తగ్గుతుంది.
గుడ్లు
గుడ్డు ద్వారా జింక్‌తో పాటు ఎన్నో అవసరమైన పోషకాలు లభిస్తాయి. రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం మహిళల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.
పప్పులు
కందిపప్పు, పెసరపప్పు, శెనగపప్పు, బీన్స్ వంటి పప్పుల్లో కూడా జింక్ ఉంటుంది. అయితే ఇవి రోజూ కాకుండా వారానికి రెండు నుంచి మూడు సార్లు తీసుకోవడం ఉత్తమం.
ఇది తప్పనిసరి
శరీరం జింక్‌ను సమర్థవంతంగా శోషించుకోవాలంటే విటమిన్–డి అవసరం. అందుకే జింక్ రిచ్ ఫుడ్స్‌తో పాటు విటమిన్–డి అందేలా ఎండలో నడక, అవసరమైతే సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
మొత్తంగా, సరైన ఆహారపు అలవాట్లతో మహిళలు జింక్ లోపాన్ని దూరం చేసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.