Rice Increase Weight: అన్నం తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Rice Increase Weight: నేటి రోజుల్లో చాలామంది ఊబకాయం బారినపడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక్కసారి ఊబకాయం బారినపడితే వివిధ రకాల వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది.

Update: 2024-04-14 16:00 GMT

Rice Increase Weight: అన్నం తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Rice Increase Weight: నేటి రోజుల్లో చాలామంది ఊబకాయం బారినపడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక్కసారి ఊబకాయం బారినపడితే వివిధ రకాల వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. అధిక బరువు, మధుమేహం, కొలస్ట్రాల్‌ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కో వాల్సి ఉంటుంది. అయితే కొంతమంది అన్నం తినడం వల్ల ఊబకాయం బారినపడుతామని అనుకుంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది.. నిపుణులు ఏం చెబుతున్నారో ఈరోజు తెలుసుకుందాం.

బియ్యం పోషకాల భాండాగారం. ఇందులో పొటాషియం, సోడియం, క్యాలరీలు, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, కొంతమేర కాల్షియం ఉంటాయి. దీన్ని సరిగ్గా తింటే శరీరంలోని ఈ పోషకాల లోపాన్ని దూరం చేసుకోవచ్చు. అన్నం తింటే స్థూలకాయం పెరుగుతుందనే అపోహ చాలామం దిలో ఉంది. బియ్యంలో పిండి పదార్థాలు ఉంటాయి విటమిన్ బి కూడా ఉంటుంది. ఇది బరువు ను పెంచదు కానీ నియంత్రణలో ఉంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బియ్యంలో తక్కువ కేలరీలు ఉంటాయి. మీరు ఒక కప్పు అన్నం సాధారణ రోటీతో సమానం.

అన్నం తింటే బరువు పెరగరు కానీ అతిగా తింటే పెరుగుతారు. మీరు ఏ ఆహారమైనా ఎక్కువగా తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. అన్నం, రోటీ ఏదైనా ఒక పద్దతి ప్రకారం తీసుకోవాలి. అవసరమైతే బ్రౌన్ రైస్, రెడ్ రైస్‌ని ఉపయోగించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పగటి పూట అన్నం తినాలి కానీ ఎక్కువ మసాలాలు, ఉప్పుతో ఉడికించకూడదు. అలాగే తిన్న వెంట నే నీళ్లు తాగకూడదు. లంచ్ లేదా డిన్నర్ తర్వాత కొన్ని నిమిషాలు నడవాలి. బరువు తగ్గడానికి ఆహారంపై మాత్రమే దృష్టిపెట్టకూడదు. దీనితో పాటు వ్యాయామం చేయాలి.

Tags:    

Similar News