Young People Heart Attack: జిమ్​ చేసే యువకులు హార్ట్​ఎటాక్ బారిన ఎందుకు పడుతున్నారు.. కారణాలు ఇవే..!

Young People Heart Attack: ఇటీవల జిమ్​ చేసే యువకులు తరచుగా హార్ట్​ఎటాక్​కు గురవుతున్నారు.

Update: 2024-02-26 12:30 GMT

Young People Heart Attack: జిమ్​ చేసే యువకులు హార్ట్​ఎటాక్ బారిన ఎందుకు పడుతున్నారు.. కారణాలు ఇవే..!

Young People Heart Attack: ఇటీవల జిమ్​ చేసే యువకులు తరచుగా హార్ట్​ఎటాక్​కు గురవుతున్నారు. దీంతో చాలామంది భయపడి జిమ్​కు వెళ్లడమే మానేశారు. దీని గురించి వైద్యులు ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడించారు. నిజానికి జిమ్​ చేయడం వల్ల ఎవ్వరూ హార్ట్​ఎటాక్​కు గురికారు కానీ వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వారు జిమ్​ చేయవచ్చా లేదా తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోకుండానే జిమ్​కి వెళ్లి కసరత్తులు చేస్తున్నారు. శరీరంలో ఉన్న రోగాలను నిర్ధారణ చేసుకోకుండా వెళ్లి హార్ట్​ఎటాక్​కు గురవుతున్నారు. జిమ్​ చేయడం ఎప్పుడూ ప్రమాదం కాదు కానీ దీనిపై కొన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండడం అవసరం.

అధికంగా వ్యాయామం చేసినా, అధికంగా కష్టపడినా గుండెపోటు రావడం అనేది శరీరంలో ఉన్న అడ్డంకుల వల్ల జరుగుతుందని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. అయితే అధికంగా వర్కవుట్లు చేసేవాళ్లు కోచ్ సలహాలు పాటించాలని సూచిస్తున్నారు. గుండె రక్తనాళాల్లో చీలిక ఏర్పడితే ఎలాంటి వ్యక్తులకైనా హార్ట్​ఎటాక్​ వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. నిజానికి నేటికాలంలో యువత ఆరోగ్యం కోసం జిమ్​లకు వెళ్లడం లేదు. సినిమాలు చూసి హీరోల మాదిరి సిక్స్​ప్యాక్​, ఎయిట్​ప్యాక్​ చేయడానికి వెళుతున్నారు. వీటికోసం జిమ్​లోనే గంటల తరబడి గడుపుతున్నారు. శరీరం సహకరించకపోయినా కండల కోసం తెగ కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వారు ముందుగా వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలి. లేదంటే హార్ట్​ఎటాక్​ ప్రమాదం పొంచి ఉంటుంది.

ఆరోగ్యం సహకరించనప్పుడు జిమ్ చేయకూడదు. నీ బాడీకి ఎదైతే సెట్​ అవుతుందో అలాంటి వ్యాయామ పద్దతులను ఎంచుకోవాలి. అంతేకానీ ప్రతి ఒక్కరూ జిమ్​ చేయకూడదు. ఇక బీపీ, డయాబెటిస్ వంటి రోగాలతో బాధపడే వ్యక్తులు జిమ్​ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. గతంలో 40-50 ఏళ్లు దాటిన వ్యక్తులకే బీపీ, షుగర్ వచ్చేవి కానీ నేటి కాలంలో యుక్త వయసులోనే రోగాలు దరిచేరుతున్నాయని.. దీంతో గుండెపోటు బారిన పడుతున్నారని వైద్యులు నిర్ధారించారు. ప్రతి ఒక్కరిలో బరువులు ఎత్తే సామర్థ్యం ఉండదు మన శరీర సామర్థ్యం ఆధారంగానే వర్కవ్​ట్స్​ చేయడం ఉత్తమం. 

Tags:    

Similar News