Body wash benefits: సబ్బుకు బదులుగా బాడీ వాష్ ఎందుకు మంచిది? ఎలాంటి బాడీ వాష్ వాడితే చర్మం మెరుస్తుంది?
ఇప్పటి కాలంలో స్నానానికి సబ్బు కన్నా బాడీ వాష్ వాడటం మరింత సౌకర్యంగా మారింది. ఇది చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది.
Body wash benefits: సబ్బుకు బదులుగా బాడీ వాష్ ఎందుకు మంచిది? ఎలాంటి బాడీ వాష్ వాడితే చర్మం మెరుస్తుంది?
Body wash benefits : ఇప్పటి కాలంలో స్నానానికి సబ్బు కన్నా బాడీ వాష్ వాడటం మరింత సౌకర్యంగా మారింది. ఇది చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది. కానీ సరైన బాడీ వాష్ ఎంచుకోవడమే కీలకం. మీ చర్మం రకాన్ని బట్టి ఎలాంటి బాడీ వాష్ ఉపయోగించాలో తెలుసుకోండి.
బాడీ వాష్ ఎందుకు మంచిది?
అన్ని సబ్బులు, బాడీ వాష్‌లు మన చర్మానికి ఉపయోగకరమవు. కొన్నింటిలో సింథటిక్ కెమికల్స్, సల్ఫేట్స్, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ లాంటివి ఉంటాయి. ఇవి చర్మాన్ని పొడిగా చేస్తాయి. పీహెచ్ బ్యాలెన్స్ సరిగా లేనప్పుడు స్కిన్ మటాషి అవుతుంది.
బాడీ వాష్‌లో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటే, చర్మం సాఫ్ట్‌గా, హైడ్రేట్‌గా ఉంటుంది. ముఖ్యంగా గ్లిజరిన్, షియా బటర్, అలోవెరా వంటి పదార్థాలున్న బాడీ వాష్‌లు మంచి ఫలితాన్నిస్తాయి.
చర్మానికి అనుసంధానంగా ఏది వాడాలి?
1. పొడిచర్మం:
మైల్డ్ సోప్ లేదా అధిక మాయిశ్చరైజింగ్ బాడీ వాష్ వాడాలి. గ్లిజరిన్, అలోవెరా, షియా బటర్ ఉండాలి.
2. సెన్సిటివ్ స్కిన్:
సల్ఫేట్, పారబెన్స్ లేని నేచురల్ ప్రోడక్ట్స్ వాడాలి. పీహెచ్ బ్యాలెన్స్ బాడీ వాష్ సురక్షితం.
3. ఆయిలీ స్కిన్:
ఐల్ కంట్రోల్ చేసే, లైట్ ఫార్ములా ఉన్న బాడీ వాష్ వాడాలి. అదనపు ఆయిల్స్, బటర్స్ లేనివి తీసుకోవాలి.
4. నార్మల్ స్కిన్:
ఏదైనా సూటవుతుంది. కానీ ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం ఉత్తమం.
బాడీ వాష్ వాడే విధానం
ముందు శరీరాన్ని నీటితో తడపాలి.
కొద్దిగా బాడీ వాష్ తీసుకుని చేతుల్లో అప్లై చేయాలి.
గోళాకార మసాజ్‌తో లూఫా లేదా వాష్ క్లాత్ ద్వారా రుద్దాలి.
తీరాక చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి.
టవల్‌తో మెల్లగా తుడవాలి.
చివరిగా మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
బాడీ వాష్ ప్రయోజనాలు
సబ్బుతో పోల్చితే మైల్డ్‌గా ఉంటుంది.
లూఫాతో ఉపయోగించినప్పుడు డెడ్ స్కిన్ తొలగిపోతుంది.
స్కిన్ హైడ్రేషన్ మెరుగవుతుంది.
స్క్రబ్ గుణాలు ఉన్న బాడీ వాష్‌లు వాడితే ముదురు పొర తొలగించబడుతుంది.
వాడకానికి అనుకూలంగా ఉంటుంది, తడిగా అయి కరిగిపోదు, క్యారీ చేయడం సులభం.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. మీ చర్మ పరిస్థితి బట్టి వైద్యుడి సలహా తీసుకోవాలి. ప్రతి చర్మానికి ఒకే విధానమూ, ఉత్పత్తీ సరిపోదు. తెలివిగా ఎంచుకోవాలి.