White Hair: చిన్న వయసులో జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? అసలు కారణం ఏంటంటే..
White Hair: జుట్టు తెల్లబడడం సర్వసాధారణమైన విషయం. అయితే ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు కేవలం పాతికేళ్ల లోపు వారిలో కూడా కినపిస్తున్నాయి.
White Hair: చిన్న వయసులో జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? అసలు కారణం ఏంటంటే..
White Hair: జుట్టు తెల్లబడడం సర్వసాధారణమైన విషయం. అయితే ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు కేవలం పాతికేళ్ల లోపు వారిలో కూడా కినపిస్తున్నాయి. సాధారణంగా చిన్న వయసులోనే జుట్టు నెరవడం ప్రధానంగా జన్యుపరమైన కారణాల వల్ల జరుగుతుంది. మీ తల్లిదండ్రుల జుట్టు అకాలంగా తెల్లబడితే, మీ జుట్టు కూడా తెల్లబడే అవకాశాలు పెరుగుతాయి.
శరీరంలో పోషకాల లోపం ఉన్నప్పుడు, ముఖ్యంగా విటమిన్ B12, ఐరన్ లేదా కాపర్ లోపం ఉంటే, జుట్టు తెల్లబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే, ఒత్తిడి, థైరాయిడ్ సమస్యలు కూడా ప్రధాన కారణాలుగా నిలుస్తాయి. కొన్ని సందర్భాల్లో, వైద్య కారణాల వల్ల కూడా జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కాలుష్యం కారణంగా కూడా జుట్టు రంగు మారుతుంది.
వీటితోపాటు విటమిన్ B12, విటమిన్ D, ఐరన్, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాల లోపం జుట్టు అకాలంగా తెల్లగా మారడానికి దారితీస్తుంది. ఒత్తిడిని ఎక్కువగా అనుభవిస్తే, అది జుట్టు మెలనిన్‌ను ప్రభావితం చేసి, వేగంగా తెల్లబడేలా చేస్తుంది. థైరాయిడ్ సమస్యలు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత కూడా జుట్టు తెల్లబడటానికి కారణమవుతాయి.
కొన్నిసార్లు హార్మోన్ల మార్పులు, పోషకాల లోపం వల్ల కూడా జుట్టు అకాలంగా తెల్లగా మారుతుంది. నిద్ర లేమి, ఒత్తిడి కూడా జుట్టు త్వరగా తెల్లబడేలా చేయవచ్చు. అటువంటి పరిస్థితుల్లో సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం ముఖ్యం.