Health: కొందరికి అస్సలు చెమట పట్టదు.. ఇది ఏమైనా సమస్యకు సంకేతమా? అసలు కారణం ఏంటంటే..

Sweating: మనలో ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా చమట వస్తుంది. కాస్త వాతావరణం వేడిగా మారినా, పని ఎక్కువైనా, వేగంగా నడిచినా వెంటనే చెమట వస్తుంది.

Update: 2025-02-10 05:30 GMT

Health: కొందరికి అస్సలు చెమట పట్టదు.. ఇది ఏమైనా సమస్యకు సంకేతమా? అసలు కారణం ఏంటంటే..

Sweating: మనలో ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా చమట వస్తుంది. కాస్త వాతావరణం వేడిగా మారినా, పని ఎక్కువైనా, వేగంగా నడిచినా వెంటనే చెమట వస్తుంది. అయితే చెమట అనగానే అయిష్టంగా చూస్తుంటాం. నిజానికి చెమట ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా.? శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, టాక్సిన్స్‌ను బయటికి పంపించడం, శరీరాన్ని చల్లగా ఉంచడం వంటివి వాటికి చెమట ఉపయోపడుతుంది.

చెమట గ్రంథులు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. చెమట ద్వారా టాక్సిన్లు బయటకు వెళ్లడం వల్ల శరీరం స్వచ్ఛంగా ఉంటుంది. సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన మనిషి శరీరంలో 2 నుంచి 4 మిలియన్ల స్వేద గ్రంథులు ఉంటాయి. చెమట రాకపోతే, శరీరం వేడిగా మారిపోతుంది. దీని వల్ల శరీరం తక్కువ సమయంలో నీరు కోల్పోతుంది కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

చెమట రాకపోవడానికి గల ప్రధాన కారణాలు:

కొంతమందికి పుట్టుకతోనే స్వేద గ్రంథులు సరిగ్గా అభివృద్ధి చెందకుండా జన్మిస్తారు. చిన్నతనం నుంచి ఈ గ్రంథులు సరిగ్గా పనిచేయకపోతే, చెమట రావడం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్టోడెర్మల్ డిస్ప్లేసియా అనేది ఒక అరుదైన జన్యు సంబంధిత సమస్య. ఈ వ్యాధితో బాధపడే వారికి చెమట గ్రంథులు లేకపోవడం లేదా తక్కువగా ఉండటం వల్ల, వారికి చెమట పట్టదు. కొంతమంది నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, చెమట పట్టే విధానం మారిపోతుంది.

కొన్ని మందులు చెమట గ్రంథుల పనితీరును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యాంటీహిస్టమిన్లు, బీటా బ్లాకర్స్, ముస్కరినిక్ రెసెప్టర్ యాంటగొనిస్ట్స్ వంటి మందులు చెమట పట్టకుండానే ఉండేలా చేస్తాయి. శరీరంలో నీరు తక్కువగా ఉంటే, చెమట గ్రంథులు సరిగ్గా పనిచేయవు. ఇది తీవ్రమైన దాహం, చర్మం పొడిబారడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. తీవ్రమైన చర్మ గాయాలు, కాలిన గాయాలు కారణంగా కూడా చెమట గ్రంథులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. చెమటరాకపోతే శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండదు ఇది హీట్ స్ట్రోక్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. చెమట ద్వారా శరీరం టాక్సిన్ బయటికి పంపుతుంది. చెమట రాకపోతే, ఈ మలినాలు శరీరంలోనే ఉండిపోతాయి.

చెమట రాకపోతే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. శరీరానికి తేమను అందించడానికి తాజా పండ్లు, నీరు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు, యోగా ద్వారా చెమట గ్రంథుల పనితీరును మెరుగుపర్చుకోవచ్చు. అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News