Washing Tips: తెల్లని బట్టలపై మొండి మరకలు ఎంత రుద్దినా పోవడం లేదా.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
Washing Tips: వైట్ కలర్ అంటే నచ్చని వాళ్లు ఎవరూ ఉండరు. ఈ కలర్ డ్రెస్ వేసుకుంటే ఎవ్వరైనా సరే చాలా స్పెషల్‌గా కనిపిస్తారు. అయితే, వీటిని ఉతికేటప్పుడు మాత్రం సినిమా కనిపిస్తుంది.
Washing Tips: తెల్లని బట్టలపై మొండి మరకలు ఎంత రుద్దినా పోవడం లేదా.. ఈ సింపుల్ టిప్స్ టై చేయండి
Washing Tips: వైట్ కలర్ అంటే నచ్చని వాళ్లు ఎవరూ ఉండరు. ఈ కలర్ డ్రెస్ వేసుకుంటే ఎవ్వరైనా సరే చాలా స్పెషల్‌గా కనిపిస్తారు. అయితే, వీటిని ఉతికేటప్పుడు మాత్రం సినిమా కనిపిస్తుంది. మొండి మరకలు ఎంత రుద్దినా పోవు. కొంత మంది ఈ కలర్ బట్టలు ఉతకడం కష్టమని వేసుకోవడం కూడా మానేస్తారు. అలాంటి వారు ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ టిప్స్ ట్రై చేస్తే ఎంత మొండి మరకలైనా సరే ఈజీగా తొలగిపోతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బేకింగ్ సోడా, నిమ్మకాయ మిశ్రమం
బేకింగ్ సోడా, నిమ్మకాయ మిశ్రమంతో మీరు తెల్లటి బట్టలను సులభంగా శుభ్రం చేయవచ్చు. దీని కోసం, ఒక చెంచా బేకింగ్ సోడాలో సగం నిమ్మకాయను పిండుకుని పేస్ట్ లా చేయండి. ఇప్పుడు దానిని మరకలు ఉన్న చోట అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత, బ్రష్‌తో తేలికగా రుద్దండి. దీని తర్వాత దానిని శుభ్రమైన నీటితో కడగండి. ఇలా చేస్తే ఈజీగా మరకలు మాయమవుతాయి.
వైట్ వెనిగర్, డిటర్జెంట్
మీరు తెల్లటి బట్టలను వెనిగర్, డిటర్జెంట్ సహాయంతో కూడా శుభ్రం చేయవచ్చు. తెల్లని బట్టలపై తీవ్రమైన మరకలు ఉంటే దీనిని ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక బకెట్ వేడి నీటిలో అర కప్పు వైట్ వెనిగర్, ఒక చెంచా డిటర్జెంట్ కలపండి.అందులో తెల్లటి దుస్తులను 30 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు మరకలు ఉన్న ప్రాంతాన్ని కాసేపు రుద్ది శుభ్రమైన నీటితో కడగండి. ఇలా చేయడం వల్ల మొండి మరకలు కూడా సులభంగా తొలగిపోతాయి.