Walking Tips: మార్నింగ్ వాక్ మంచిదా? ఈవినింగ్ వాక్ మంచిదా?
Walking Tips: శరీరం..మనస్సు ఈ రెండు ఉల్లాసంగా ఉండాలంటే నడక ఉండాలి. వాకింగ్ అనే పదం చాలా చిన్నది. కానీ దాని పవర్ మాత్రం చాలా ఎక్కువ. దాని వల్ల వచ్చే లాభం కూడా చాలా ఎక్కువ.
Walking Tips: మార్నింగ్ వాక్ మంచిదా? ఈవినింగ్ వాక్ మంచిదా?
Walking Tips: శరీరం..మనస్సు ఈ రెండు ఉల్లాసంగా ఉండాలంటే నడక ఉండాలి. వాకింగ్ అనే పదం చాలా చిన్నది. కానీ దాని పవర్ మాత్రం చాలా ఎక్కువ. దాని వల్ల వచ్చే లాభం కూడా చాలా ఎక్కువ. అందుకే ఎటువంటి వ్యాయామం చేయకపోయినా పర్వాలేదు కానీ వాకింగ్ మాత్రం చేయాలని డాక్టర్లు అంటారు. అయితే చాలామందికి ఉదయం పూట చేసే వాకింగ్ మంచిదా లేక రాత్రి పూట చేసే వాకింగ్ మంచిదా? అనే అనుమానాలు ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు చూద్దాం.
వాకింగ్ అనేది ఒక ఎఫెక్టివ్ ఎక్సర్ సైజ్. ఇదొక ఏరోబిక్ చర్య. వాకింగ్ చేయడం వల్ల శరీరం దిగువ భాగంలో ఉన్న కండరాలన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. ప్రతి రోజు ఒక గంట పాటు నడవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. అంటే వేగంగా నడవడం వల్ల గుండె, శ్వాస వ్యవస్థకు ప్రయోజనం ఉంటుంది. ఆంగ్జయిటీ, డిప్రెషన్ వంటి వాటితో బాధపడేవారికి నడక చాలా మంచిది. అంతేకాదు నడక వల్ల ఎముకలు బలపడతాయి. కండరాలు పటిష్టంగా మారతాయి. ఇక బరువు తగ్గాలనేవారికి కూడా క్యాలరీలు బాగా తగ్గుతాయి. అలాగే ఇన్సులిన్ నియంత్రణలో ఉండాలంటే బాగా నడవాలి.
అయితే చాలామందికి ఉదయం పూట చేసే నడక మంచిదా? లేక సాయంత్ర లేదా రాత్రి సమయాల్లో చేసే వాకింగ్ మంచిదా? అని ఆలోచిస్తుంటారు అయితే దీనిపై డాక్టర్లు ఏమంటున్నారో చూద్దాం.
ఉదయం నడక
ఉదయం పూట నడిచే నడక వల్ల మెటబాలిజం బూస్ట్ అవుతుంది. బాడీలోని క్యాలరీలు బర్న్ అవుతాయి. దీనివల్ల రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా ఉదయం పూట ఉండే ఎండలో వాకింగ్ చేయడం వల్ల విటమిన్ డి కూడా దొరుకుతుంది. దీనివల్ల బాడీ పెయిన్స్ తగ్గుతాయి. అదేవిధంగా రాత్రిళ్లు బాగా నిద్రపడుతుంది. అంతేకాదు, ఉదయం పూట తగిలే సూర్యరశ్మి వల్ల మైండ్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. దీంతో మైండ్‌లో ఉన్న ఒత్తిడి, యాంగ్జైంటీలు దూరం అవుతాయి. అలాగే, ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల బ్రెయిన్ పనితీరు కూడా మెరుగవుతుంది. బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. ఈ సమయంలో పొల్యూషన్ కూడా అంతగా ఉండదు. కాబట్టి ఫ్రెష్ ఎయిర్ శ్వాసకోశ ఇబ్బందుల నుంచి దూరం చేస్తుంది.
సాయంత్రం నడక
ఉదయం వీలు కానీ వాళ్లు సాయంత్ర పూట నడుస్తూ ఉంటారు. ఇది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. నిద్ర బాగా పడుతుంది. స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. రోజంతా పనిచేసి అలసటగా ఉండటం వల్ల ఈ సమయంలో వాకింగ్ చేస్తే రిలాక్స్ అవుతారు. అంతేకాదు.. కూర్చుని లేదా నిలబడి లేదా వాహనాల్లో తిరిగి పనులు చేసేవారు సాయంత్రం సమయంలో వాకింగ్ చేయడం వల్ల వారి శరీరంలో కండరాలను రిలీజ్ అవుతాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారు. అంతేకాదు, రోజులో ఏ పనులు చేయాలో అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే అప్పటికి రోజు గడిచిపోయి ఉంటుంది. దీంతో మైండ్ రిలాక్స్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది.
ఏ టంలో నడక మంచిది
ఉదయం వేళలో చేస్తే నడక ఒక రకమైన లాభం, సాయంత్రం వేళలో నడిస్తే ఇంకొకరకమైన లాభం. ఇక ఈ రెండు సమయాల్లో ఏ సమయంలో చేస్తే ఆరోగ్యానికి ఎక్కువ మంచిది అని ఆలోచిస్తే.. రెండు మంచివే. అసలు వాకింగే మంచిదని డాక్టర్లు అంటున్నారు. రాత్రిళ్లు అన్నం తిన్న అరగంట లేదా గంట తర్వాత చేసే వాకింగ్ వల్ల కూడా శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి రోజులో ఏ సయమంలోనైనా ఒక గంటపాటు వాకింగ్ తప్పనిసరిగా చేయాలని డాక్టర్లు చెబుతున్నారు.