Night Walk Benefits: నిద్రపోయే ముందు కొద్దిసేపు వాకింగ్‌ చేయండి.. బాడీలో ఈ మార్పులు గమనిస్తారు..!

Night Walk Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం తప్పకుండా చేయాలి.

Update: 2024-04-24 15:00 GMT

Night Walk Benefits: నిద్రపోయే ముందు కొద్దిసేపు వాకింగ్‌ చేయండి.. బాడీలో ఈ మార్పులు గమనిస్తారు..!

Night Walk Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం తప్పకుండా చేయాలి. లేదంటే ఇమ్యూనిటీ పవర్‌ తగ్గి త్వరగా రోగాలబారిన పడుతారు. అయితే వయసు రీత్యా వ్యాయామ పద్దతులు వేరుగా ఉంటాయి. యువకులైతే రన్నింగ్‌, జాగింగ్‌, జిమ్‌కి వెళ్లడం, బరువులు ఎత్తడం, స్విమ్మింగ్‌ వంటివి చేస్తారు. వయసు పై బడిన వారైతే వాకింగ్‌ చేయడం, యోగా, ధ్యానం, ఎక్సర్‌ సైజ్‌ వంటివి చేస్తారు. అయితే వీటిలో వాకింగ్‌ ప్రతి ఒక్కరూ చేయవ చ్చు. ఉదయం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు టైమ్‌ దొరికితే అప్పుడు వాకింగ్‌ చేయవచ్చు. అయితే పడుకునే ముందు కొద్దిసేపు వ్యాయామం చేయడం వల్ల బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈ రోజు తెలుసుకుందాం.

నిద్రను మెరుగుపరుస్తుంది

నిద్రపోయే ముందు తేలికపాటి నడక శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇది మంచి నిద్రకు దోహదం చేస్తుంది. దీనివల్ల మనసుకు ప్రశాంతతతో పాటు తేలికగా నిద్ర పడుతుంది.

మానసిక ఆరోగ్యం

సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అంతేకాకుండా ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గుతారు

రోజూ నిద్రపోయే ముందు నడవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువు తగ్గించడంలో సాయపడుతుంది.

గుండె ఆరోగ్యం

రెగ్యులర్ ఈవెనింగ్ వాక్ గుండె కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. నడక వల్ల కాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్లకు బలం చేకూరుతుంది.

ఈవెనింగ్ వాక్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటలు నడకకు వెళ్లాలి.

అతి వేగంగా నడవవద్ద. తేలికపాటి వేగంతో మాత్రమే నడవాలి.

సౌకర్యవంతమైన దుస్తులు, బూట్లు ధరించాలి.

ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడి సలహా తీసుకోండి.

Tags:    

Similar News