Hair Tips: అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం గుంటకలగర.. ఈ 5 చిట్కాలు పాటించండి

Hair Tips: నేటి కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, కల్తీ ఆహార పదార్థాలు.

Update: 2025-04-27 06:37 GMT

Hair Tips: అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం గుంటకలగర.. ఈ 5 చిట్కాలు పాటించండి

Hair Tips: నేటి కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, కల్తీ ఆహార పదార్థాలు. రాలుతున్న జుట్టును ఆపడానికి, జుట్టు పెరుగుదలను మెరుగుపరచడానికి ప్రజలు వేల రూపాయల విలువైన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అయితే సహజమైన పదార్థాలు కూడా జుట్టుకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ విషయంలో భృంగరాజ్(గుంటకలగర ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది జుట్టుకు ఒక వరం లాంటిది. ఈ మొక్క ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని ఆపడమే కాకుండా, జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి. జుట్టును ఒత్తుగా చేస్తాయి. గుంటకలగర ఆకులు, దాని పొడిని వివిధ రకాలుగా జుట్టు కోసం ఉపయోగించి మీ జుట్టు సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.

గుంటకలగర ఒక మొక్క ఇది సులభంగా లభిస్తుంది. ఇది ఔషధ గుణాలు కలిగిన ఒక మూలిక. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. గుంటకలగరను జుట్టులో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ మాస్క్‌లా వేయండి

ఆయుర్వేద దుకాణం నుండి భృంగరాజ్ పొడిని తెచ్చుకోండి లేదా మొక్క లభిస్తే దాని ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. ఈ పొడిలో పెరుగు, కలబంద గుజ్జు కలపండి. మీ వద్ద ఉసిరి పొడి ఉంటే దానిని కూడా కలపవచ్చు. దీనివల్ల ఈ హెయిర్ మాస్క్ ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఈ మాస్క్‌ను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేసి కనీసం గంటన్నర తర్వాత హెర్బల్ షాంపూతో కడగాలి. ఈ ప్యాక్‌ను వారానికి లేదా 15 రోజులకు ఒకసారి వేసుకోవచ్చు.

నూనెతో కలిపి వేయండి

జుట్టుకు షాంపూ చేయడానికి ఒక రోజు ముందు రాత్రి లేదా షాంపూ చేయడానికి రెండు గంటల ముందు కొబ్బరి నూనెలో భృంగరాజ్ పొడిని కలిపి తలకు, జుట్టుకు అప్లై చేసి అలా వదిలేయండి. ఈ విధంగా వారానికి రెండు నుండి మూడు సార్లు ఈ చిట్కాను పునరావృతం చేయవచ్చు. దీనివల్ల మీకు మంచి ఫలితం లభిస్తుంది.

భృంగరాజ్ నీటిని తలకు పట్టించండి

గుంటకలగర ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో జుట్టు కడుక్కోవచ్చు లేదా ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి నిల్వ చేసుకోవచ్చు. ప్రతిసారి షాంపూ చేయడానికి రెండు గంటల ముందు ఈ నీటిని దూది సహాయంతో మీ తలకు పట్టించండి లేదా స్ప్రే చేయండి. దీనివల్ల కూడా మీకు మంచి ఫలితం లభిస్తుంది.

భృంగరాజ్ నూనెతో మర్దన చేయండి

ఇంట్లో భృంగరాజ్ నూనెను తయారు చేసి నిల్వ చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో భృంగరాజ్ ఆకులను వేసి 10 నుండి 15 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత ఒక సీసాలో నింపండి. ఈ నూనెతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేసి రెండు గంటల తర్వాత జుట్టు కడగాలి.

గుంటకలగరను తీసుకోండి

తినగలిగే భృంగరాజ్ పొడిని తెప్పించుకుని దానిని తీసుకోవచ్చు. దీనివల్ల జుట్టు సమస్యలు తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే దీని కోసం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Tags:    

Similar News