Travel Tips: విమానంలో ప్రయాణిస్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి
Travel Tips: విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరింత సురక్షితంగా, సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు.
Travel Tips: విమానంలో ప్రయాణిస్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి
Travel Tips: విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరింత సురక్షితంగా, సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు. ప్రయాణానికి ముందు తగినంత నీరు తాగడం, వదులైన దుస్తులు వేసుకోవడం, సీటు బెల్ట్ ధరించడం, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం లాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం సౌకర్యంగా, సురక్షితంగా ఉండేందుకు ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలో తెలుసుకోందాం..
విమానంలో ప్రయాణంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ..
*ప్రయాణానికి ముందు తగినంత నీరు త్రాగండి.
*విమాన ప్రయాణంలో వదులైన దుస్తులు ధరించడం వల్ల శరీరానికి తగినంత గాలి లభిస్తుంది.
*సీటు బెల్ట్ ధరించడం వల్ల విమాన ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగితే గాయాల నుండి బయటపడతారు.
*ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ పక్కనున్న వారిని ఇబ్బంది పెట్టకండి.
*మీరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులయితే, ప్రయాణానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.
*ప్రయాణించేటప్పుడు ఆక్సిజన్ అవసరం ఉంటే ముందుగా ఎయిర్‌లైన్‌కు తెలియజేయండి. తద్వారా వారు తగిన ఏర్పాట్లు చేస్తారు.
*మీరు విమానంలో తీసుకెళ్లకూడని వస్తువులు ఏంటో ముందుగా తెలుసుకోండి.
*ప్రయాణించేటప్పుడు మీకు ఏదైనా సమస్య ఎదురైతే సిబ్బందికి తెలియజేయండి.
*విమానం దిగడానికి తొందరపడకండి. విమానం పూర్తిగా ఆగిపోనివ్వండి. ఆ తర్వాతే మీ సీటు నుండి లేచి హాయిగా బయటకి వెళ్లండి.