Thyroid Treatment: థైరాయిడ్‌ చాలా డేంజర్‌.. ఈ ఆయుర్వేద పద్దతుల ద్వారా నివారించండి..!

Thyroid Treatment: నేటి రోజుల్లో మహిళల్లో థైరాయిడ్‌ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 10 సంవత్సరాల్లో ఈ వ్యాధి కేసులు అధికంగా పెరిగాయి.

Update: 2023-11-29 14:30 GMT

Thyroid Treatment: థైరాయిడ్‌ చాలా డేంజర్‌.. ఈ ఆయుర్వేద పద్దతుల ద్వారా నివారించండి..!

Thyroid Treatment: నేటి రోజుల్లో మహిళల్లో థైరాయిడ్‌ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 10 సంవత్సరాల్లో ఈ వ్యాధి కేసులు అధికంగా పెరిగాయి. 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది. చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఇలా జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంధి పనితీరు తగ్గడం వల్ల థైరాయిడ్ వ్యాధి వస్తుంది. దీనిని ఆయుర్వేద పద్దతుల ద్వారా నివారించవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కలబంద

మహిళలు ప్రతిరోజు కలబందను తినాలి. దీనివల్ల థైరాయిడ్ సమస్యలు అదుపులో ఉంటాయి. ఇది వాత, కఫా రెండింటినీ సమతుల్యం చేస్తుంది. శరీరంలో థైరాయిడ్ వ్యాధిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

కొత్తిమీర

థైరాయిడ్ వ్యాధిని నియంత్రించడంలో కొత్తిమీర చాలా మేలు చేస్తుంది. కొత్తిమీరతో పాటు జీలకర్ర కూడా తీసుకోవాలి. కొత్తిమీర, జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఈ నీటిని ఉదయాన్నే వడపోసి పరగడుపున తాగాలి. ఇది థైరాయిడ్ వ్యాధిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

ప్రతి ఉదయం నడవండి

ప్రతిరోజూ ఉదయం నడవడం వల్ల శరీరంలో ఆక్సిజన్‌ ప్రసరణ పెరుగుతుంది. ఇది థైరాయిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం 15 నుంచి 20 నిమిషాలు నడవాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కపాలభాతి

కపాలభాతి చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. మీరు ఈ ప్రాణాయామం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా చేయవచ్చు. ఇది థైరాయిడ్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే చేయాలి.

థైరాయిడ్ వ్యాధి ఎందుకు వస్తుంది?

శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంధి పనితీరు తగ్గినప్పుడు థైరాయిడ్ వ్యాధి వస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాధి మహిళల్లో వేగంగా వ్యాపిస్తోంది. థైరాయిడ్ గ్రంధి పనితీరు తగ్గడమే కాకుండా ఆహారంలో అయోడిన్ లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.

Tags:    

Similar News