Dry Skin: ఈ పొరపాట్ల వల్ల చర్మం పొడిగా మారుతుంది.. జాగ్రత్త..!

Dry Skin: ఈ పొరపాట్ల వల్ల చర్మం పొడిగా మారుతుంది.. జాగ్రత్త..!

Update: 2022-10-28 11:09 GMT

Dry Skin: ఈ పొరపాట్ల వల్ల చర్మం పొడిగా మారుతుంది.. జాగ్రత్త..!

Dry Skin: చలికాలంలో కూడా చర్మం పొడిగా మారుతుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. ముఖ్యంగా కాలుష్యం, సూర్యకాంతి, సరైన చర్మ సంరక్షణ పాటించకపోవడం వంటివి ఉంటాయి. వీటితో పాటు చెడు అలవాట్ల వల్ల కూడా చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి. ఈ పరిస్థితిలో చర్మాన్ని తేమగా మార్చడం అవసరం. ఒక్కోసారి మాయిశ్చరైజర్‌ని ఉపయోగించినప్పటికీ ఎటువంటి ప్రభావం ఉండదు. అయితే చర్మం పొడిబారడానికి కారణమయ్య అలవాట్ల గురించి తెలుసుకుందాం.

వేడి నీటితో స్నానం

వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీర అలసట తొలగిపోతుందని అందరు చెబుతారు. కానీ వేడి నీటిని ఉపయోగించడం వల్ల చర్మం మరింత దెబ్బతింటుంది. వేడి నీరు చర్మంలో ఉన్న ఆయిల్, తేమను తొలగిస్తుంది. అందుకే వేడి నీళ్లతో స్నానం కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

అధిక నీరు తీసుకోవడం

నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ మీరు పరిమితికి మించి నీరు తాగితే అది హాని కలిగిస్తుంది. ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరంలోని పోషకాలు బయటకు వెళ్లిపోతాయి. దీని కారణంగా శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది.

నిద్రపోయేటప్పుడు జాగ్రత్తలు

చాలా మంది మేకప్ వేసుకొని అలాగే నిద్రపోతారు. ఇది చర్మానికి మంచిది కాదు. నిద్రకు ఉపక్రమించే ముందు ముఖాన్ని కడుక్కుని, మాయిశ్చరైజర్ రాసుకొని పడుకోవాలి. రాత్రి చర్మ సంరక్షణ దినచర్య చాలా ముఖ్యం ఇది మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.

Tags:    

Similar News