Winter Skin Care: చ‌లికాలం చ‌ర్మ సంరక్ష‌ణ‌కు ఈ 6 మార్పులు అత్య‌వ‌స‌రం..

Winter Skin Care: కాలాల‌ను బట్టి చ‌ర్మానికి తీసుకునే జాగ్ర‌త్త‌లు కూడా మారుతాయి

Update: 2021-10-31 16:00 GMT

చలికాలంలో స్కిన్ కేర్ కు తీసుకోవలసిన జాగ్రత్తలు (ఫైల్ ఇమేజ్)

Winter Skin Care: కాలాల‌ను బట్టి చ‌ర్మానికి తీసుకునే జాగ్ర‌త్త‌లు కూడా మారుతాయి. చలికాలం వ‌చ్చినందున న‌గ‌రాల‌లో నివ‌సించేవారు పెరుగుతున్న కాలుష్య స్థాయిల నుంచి చర్మాన్ని కాపాడుకోవ‌డం చాలా ముఖ్యం. ముఖ్యంగా చర్మంలో తేమ లేకపోవడం వ‌ల్ల డీహైడ్రేట్‌కి గుర‌వుతారు. అయితే ఈ కాలంలో చ‌ర్మం ప‌గులుతూ ఉంటుంది. మిమ్మ‌ల్ని ఇరిటేట్ చేస్తుంది. అంతేకాదు ముఖం మొత్తం అంద విహీనంగా త‌యార‌వుతుంది. అందుకే కొన్ని ప‌ద్దుతులు పాటించ‌డం అవ‌సరం. వాటి గురించి తెలుసుకుందాం.

1. క్రీమ్ ఆధారిత క్లెన్సర్‌

నురుగుకు బదులుగా క్రీమ్ ఆధారిత క్లెన్సర్‌ని ఎంచుకోండి. నురుగుతో కూడిన ఫేస్ వాష్‌లు మీ ముఖంలోని మురికిని, ఇంకా ఆయిల్‌ని శుభ్రం చేస్తాయి.

2. pH బ్యాలెన్స్‌

ఈ కాలంలో క్రీమ్ ఆధారిత క్లెన్సర్ లేదా కొన్ని ఆయిల్స్ మంచి ఎంపిక అవుతుంది. ఇది సరైన pH బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సాయం చేస్తుంది. మీ చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తుంది.

3. ఎక్స్‌ఫోలియేట్

సీజన్‌తో సంబంధం లేకుండా ఎక్స్‌ఫోలియేషన్ చాలా ముఖ్యం. చర్మం కింద పేరుకుపోయిన మృతకణాలను తొలగించే సున్నితమైన స్క్రబ్ అవసరం. కానీ మీరు దానిని అతిగా చేయకూడదు. వారానికి ఒకసారి ఎక్స్‌ఫోలియేట్ చేయడం వ‌ల్ల చ‌ర్మం అందంగా త‌యార‌వుతుంది.

4. స‌బ్బులు

ఈ కాలంలో మాయిశ్చ‌రైజ‌ర్‌లా ప‌నిచేసే స‌బ్బుల‌ను ఎంచుకోవ‌డం ముఖ్యం. ముఖ్యంగా అలోవేరా ఉండే సబ్బులు ఆరోగ్యానికి మంచివి. చ‌ర్మాన్ని మృదువుగా ఉంచుతాయి.

5. మాయిశ్చరైజర్

చ‌ర్మం ఎప్పుడు తేమ‌గా ఉండాలి. హెవీ క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకుంటే మంచిది. వేసవిలో తేలికపాటి మాయిశ్చరైజర్ అనువైన ఎంపిక. కానీ శీతాకాలంలో అలా కాదు. హెవీ క్రీమ్ ఉండాలి. అప్పుడే అది తేమను లాక్ చేయడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News