Tattoo Side Effects: శరీరంలోని ఈ భాగాలపై టాటూ వేయించుకోవడం ప్రమాదకరం.. పొరపాటున కూడా అలా చేయకండి
Tattoo Side Effects: ఈ రోజుల్లో టాటూ వేయించుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారింది. కానీ, టాటూ మీ ఆరోగ్యానికి ప్రమాదకరం.
Tattoo Side Effects: శరీరంలోని ఈ భాగాలపై టాటూ వేయించుకోవడం ప్రమాదకరం.. పొరపాటున కూడా అలా చేయకండి
Tattoo Side Effects: ఈ రోజుల్లో టాటూ వేయించుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారింది. కానీ, టాటూ మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. నేడిల్ ఉపయోగించి మెషీన్ ద్వారా టాటూ వేస్తారు. ఇది ఇన్ఫెక్షన్, అలెర్జీ వంటి సమస్యలను కలిగిస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే టాటూ వేయించుకోవచ్చు, కానీ శరీరంలోని కొన్ని భాగాలపై టాటూ వేయించుకోవడం ప్రమాదకరం. టాటూ వేయించుకోవడం వల్ల కలిగే నష్టాలు, శరీరంలోని ఏ భాగాలపై టాటూ వేయించుకోవడం అత్యంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల కలిగే నష్టాలు
*టాటూల వల్ల చర్మ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దురద, వాపు, ఎరుపు, చీము వంటి సమస్యలు వస్తాయి.
*కొంతమంది చర్మానికి టాటూ పడకపోవచ్చు. అందువల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.
*టాటూ స్టూడియోలలో ఉపయోగించే కొన్ని సూదులు హెచ్ఐవి వంటి తీవ్రమైన వ్యాధులు కలిగించవచ్చు.
*కొన్నిసార్లు టాటూ వేయించుకున్న తర్వాత చర్మంపై మచ్చ ఏర్పడుతుంది. అది శాశ్వతంగా ఉంటుంది.
*టాటూ వేసిన ప్లేసులో చికాకు లేదా వాపు రావచ్చు.
శరీరంలోని ఏ భాగాలపై టాటూ వేయించుకోవడం ప్రమాదకరం?
*కళ్ళ దగ్గర ఉన్న ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. ఇక్కడ టాటూ వేయించుకోవడం వల్ల శాశ్వత దృష్టి లోపం ఏర్పడుతుంది.
*పొరపాటున కూడా జననేంద్రియ ప్రాంతంలో టాటూ వేయించుకోకండి. ఇక్కడి చర్మం చాలా సన్నగా, సున్నితంగా ఉంటుంది. ఇది ఇన్‌ఫెక్షన్, తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.
*వేళ్లు, కాలి వేళ్లపై టాటూలు వేయించుకోవడం మంచిది కాదు. పదే పదే తాకడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
*వెన్నెముక దగ్గర టాటూ అస్సలు వేయించుకోకండి. టాటూ తప్పుగా చేస్తే నరాలు దెబ్బతింటాయి.
* నోటి లోపలి భాగం లేదా పెదవులపై టాటూ వేయించుకోవడం ప్రమాదం. దీని కారణంగా ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాపిస్తుంది.
*చెవి లోపల లేదా వెనుక భాగం చాలా సన్నగా ఉంటుంది. వీటిపై టాటూ వేయించుకోవడం వల్ల భరించలేని నొప్పి వస్తుంది.