Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ‌ తీసుకుంటున్నారా? ఇవి మర్చిపోవద్దు

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాలసీ తీసుకునే సమయంలో ఏదైనా విషయాలు దాచిపెడితే ఇబ్బందులు వస్తాయా?

Update: 2025-02-05 06:45 GMT

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ‌ తీసుకుంటున్నారా? ఇవి మర్చిపోవద్దు 

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాలసీ తీసుకునే సమయంలో ఏదైనా విషయాలు దాచిపెడితే ఇబ్బందులు వస్తాయా? రూల్స్ ఏం చెబుతున్నాయి? అన్ని విషయాలు కరెక్టుగా చెబితేనే ఇబ్బందులుండవా? అసలు విషయాలు తెలుసుకుందాం.

హెల్త్ పాలసీ తీసుకునే సమయంలో వ్యక్తిగత, ఆరోగ్య సమాచారాన్ని కచ్చితంగా చెప్పాలి. ఈ వివరాలు చెబితేనే పాలసీ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ప్రతి విషయాన్ని భీమా సంస్థ పాలసీ తీసుకునే వ్యక్తి నుంచి సేకరిస్తుంది. ఈ సమయంలో తప్పుడు సమాచారం చెబితే పాలసీ తీసుకునేవారికే నష్టం చేసే అవకాశం ఉంది.

పాలసీ తీసుకుంటున్న వ్యక్తి తనకు ఉన్న వ్యాధుల గురించి కచ్చితంగా తెలపాలి. లేకపోతే పాలసీ క్లైయిం చేసే సమయంలో ఇబ్బందులు వస్తాయి. పాలసీ తీసుకునే సమయంలో హెల్త్ హిస్టరీ ఆధారంగా ప్రీమియాన్ని ఖరారు చేస్తాయి భీమా సంస్థలు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల గురించి కూడా భీమా సంస్థలు ఆరా తీస్తాయి. వీటి గురించి కూడా వివరించాలి. బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన సమస్యలు, అస్తమా, క్యాన్సర్ వంటి వాటి గురించి పాలసీ తీసుకునే సమయంలో దాచి పెట్టవద్దు.

పాలసీ తీసుకున్న 15 రోజుల్లో పాలసీని సమీక్ష చేసుకోవచ్చు. ఈ సమయంలో ఏవైనా అంశాల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది.ఒకవేళ అప్పటికీ విషయాలను దాచిపెడితే ఇబ్బందులు తప్పవు.

Tags:    

Similar News