Skin Care Tips: చలికాలంలో కూడా సన్‌స్క్రీన్‌ అప్లై చేయాల్సిందే.. ఎందుకంటే..?

Skin Care Tips: చలికాలంలో కూడా సన్‌స్క్రీన్‌ అప్లై చేయాల్సిందే.. ఎందుకంటే..?

Update: 2022-10-29 14:27 GMT

Skin Care Tips: చలికాలంలో కూడా సన్‌స్క్రీన్‌ అప్లై చేయాల్సిందే.. ఎందుకంటే..?

Skin Care Tips: చాలామంది ఎండాకాలంలో చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ఉపయోగిస్తారు. కానీ శీతాకాలంలో దీని అవసరం ఉండదనుకుంటారు. వాస్తవానికి చలికాలంలో కూడా సన్‌స్క్రీన్ ఉపయోగించాల్సిందే. ఎందుకంటే ఈ సీజన్‌లో కూడా ఎండ, టాన్ ఎక్కువగానే ఉంటుంది. వేడి కిరణాలు చర్మాన్ని ఎప్పుడైనా దెబ్బతీస్తాయి. శీతాకాలంలో సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.

వింటర్ సీజన్‌లో సన్‌స్క్రీన్ అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. వేసవిలో కంటే శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుందని అందరు అనుకుంటారు. అయితే ఒక అధ్యయనం ప్రకారం చల్లని గాలుల వల్ల చర్మం పగులుతుంది. అంతేకాకుండా ఈ గాలిలో టాన్‌ ఎక్కువగా ఉంటుంది. దీని కోసం సన్‌స్క్రీన్ ఉపయోగించాలి.

చర్మ క్యాన్సర్ ప్రమాదం

శీతాకాలంలో సూర్యుని కిరణాలు అంత బలంగా అనిపించకపోయినా ఎక్కువ సమయం ఎండలో ఉండటం మంచిది కాదు. సూర్య కిరణాల వల్ల సన్‌టాన్, సన్‌బర్న్ లేదా డార్క్ స్పాట్స్ ఉండటమే కాకుండా చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. శీతాకాలంలో ఓజోన్ పొర సన్నగా మారుతుంది. దీని వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల శీతాకాలంలో 30 APF సన్‌స్క్రీన్ క్రీమ్‌ను అప్లై చేయడం అవసరం.

వేసవిలో సన్‌స్క్రీన్ చెమటతో బయటకు వస్తుంది. అలాగే శీతాకాలంలో చల్లని గాలులు మీ క్రీమ్ ప్రభావాన్ని త్వరగా తగ్గిస్తాయి. ఈ పరిస్థితిలో మీరు వేసవిలో ప్రతి 3 గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం అవసరం. మీ చర్మాన్ని బట్టి సన్‌స్క్రీన్‌ని ఎంచుకోండి. అయితే సన్‌స్క్రీన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మొటిమలు లేదా చర్మ అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సరిపోయేంత వరకు మాత్రమే వాడండి.

Tags:    

Similar News