Summer Diseases: ఎండాకాలం ఈ రెండు జబ్బుల ప్రమాదం ఎక్కువ.. జాగ్రత్త..!

Summer Diseases: భారతదేశంలోని చాలా నగరాల్లో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది...

Update: 2022-04-07 11:30 GMT

Summer Diseases: ఎండాకాలం ఈ రెండు జబ్బుల ప్రమాదం ఎక్కువ.. జాగ్రత్త..!

Summer Diseases: భారతదేశంలోని చాలా నగరాల్లో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. దీని కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిలో వైరల్ జ్వరం, డయేరియా ఇన్ఫెక్షన్ కారణంగా డీహైడ్రేషన్ సమస్యలు పెరగడం ప్రారంభించాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అతిసారం, వైరల్ జ్వరం లక్షణాల గురించి ప్రజలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

శరీరంలో వైరల్ ఫీవర్, డయేరియా లక్షణాలు గమనించినప్పుడు సమీపంలోని ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. ఈ వ్యాధులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

అతిసారం లక్షణాలు

కడుపు నొప్పి, వికారం లేదా వాంతులు, కడుపు తిమ్మిరి, ఆకలి లేకపోవడం, తలనొప్పి సమస్య, జ్వరం సమస్య, నిరంతర దాహం, మలంలో రక్తం, డీహైడ్రేషన్ సమస్య, రోజుకు చాలాసార్లు పేగు కదలికలు ఉంటాయి.

వైరల్ ఫీవర్ లక్షణాలు

తలనొప్పి సమస్య, కళ్లు ఎర్రబారడం, కళ్లు మంటగా అనిపించడం, గొంతులో నొప్పి, చలిగా అనిపించడం, శరీర నొప్పి, శరీర ఉష్ణోగ్రత పెరగడం, కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.

డయేరియా, వైరల్ ఫీవర్ నివారించడం ఎలా?

మొదటగా డీహైడ్రేషన్‌ను నివారించండి. రోగనిరోధక శక్తిని పెంచుకోండి. కలుషిత నీటిని తాగవద్దు. మారుతున్న కాలంలో బయటి వస్తువులను తినడం మానుకుంటే మంచిది. గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. సమతుల్య ఆహారం తీసుకోండి. వైరల్ ఫీవర్ ఉన్న రోగులకి దూరంగా ఉండాలి. సకాలంలో వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచిది.

Tags:    

Similar News