Summer: సమ్మర్‌లో కడుపు సమస్యలు ఎందుకు వస్తాయి.? ఎలా చెక్ పెట్టాలంటే
Summer: వేసవి కాలంలో అధిక వేడి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల అజీర్ణం, గ్యాస్, వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
Summer: సమ్మర్‌లో కడుపు సమస్యలు ఎందుకు వస్తాయి.? ఎలా చెక్ పెట్టాలంటే
Summer: వేసవి కాలంలో అధిక వేడి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల అజీర్ణం, గ్యాస్, వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే, సరైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. పొట్టకు చల్లదనం అందించే, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే కొన్ని ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* పుదీనాలోని మెంథాల్ తత్వం పొట్టలో చల్లదనాన్ని కలిగిస్తుంది. పుదీనా ఆకులను చట్నీలో కలిపి లేదా నీటిలో మరిగించి తీసుకోవచ్చు. ఇది అజీర్ణాన్ని తగ్గించి, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
* అరటిపండు కూడా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది పొట్టలో ఆమ్లతను తగ్గించి, కంట్రోల్‌లో ఉంచుతుంది. రోజూ ఒక అరటిపండు తినడం వల్ల అజీర్ణం, వాంతులు వంటి సమస్యలు తగ్గుతాయి.
* కడుపులో మంటగా ఉంటే చల్లటి పాలు తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇవి కాల్షియంతో పాటు ఆమ్లతను తగ్గిస్తుంది. ఉదయం ఒక కప్పు చల్లని పాలు తాగడం వల్ల జీర్ణాశయం మెరుగ్గా పనిచేస్తుంది.
* భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపు తీసుకుంటే గ్యాస్, ఆమ్లత వంటి సమస్యలు తగ్గుతాయి. సోంపు నీటిని మరిగించి తాగితే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. వేసవిలో పొట్టను చల్లగా ఉంచే అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా సోంపు పనిచేస్తుంది.
* తులసి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. తులసి ఆకులను ఖాళీ కడుపుతో నమలడం లేదా తులసి టీగా తాగడం వల్ల వేడి వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవడంలో కూడా సహాయపడుతుంది.
* పెరుగు అన్నం, ఖిచ్డీ, కూరగాయల సూప్‌ల వంటివి తీసుకోవాలి. ఇవి తేలికగా జీర్ణమై కడుపును ప్రశాంతంగా ఉంచుతుంది.
* తీసుకునే ఆహార పదార్థాల్లో మసాలా వినియోగం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మసాల ఎక్కువైతే కడుపులో ఆమ్లత పెరిగే అవకాశం ఉంటుంది.
* వేసవిలో కడుపు సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తాగాలి. నీటితో పాటు కొబ్బరి నీరు, లెమన్ జ్యూస్, బటర్ మిల్క్ వంటివి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* ఇక తీసుకునే ఆహారంలో జామపండు, సీతాఫలం, సపోటా, దోసకాయ, బీరకాయ వంటివి ఉండేలా చూసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి.