Suicidal Thoughts: ఈ నెలలోనే సూసైడల్ థాట్స్ ఎక్కువగా వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు
జీవితంలో ఎప్పుడో ఒకసారి “ఇక బతకడం వృథా” అనే భావన చాలామందిలో కలుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Suicidal Thoughts: ఈ నెలలోనే సూసైడల్ థాట్స్ ఎక్కువగా వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు
జీవితంలో ఎప్పుడో ఒకసారి “ఇక బతకడం వృథా” అనే భావన చాలామందిలో కలుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నెగెటివ్ ఆలోచనలు కొంతమందిలో ఆత్మహత్య చేసుకోవాలనే స్థాయికి చేరుతుంటాయి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సమయాల్లో ఈ తరహా ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లో నిర్వహించిన ఓ పరిశోధన ప్రకారం.. రోజులో ఉదయం వేళల్లోనే కాకుండా, సంవత్సరంలో డిసెంబర్ నెలలో సూసైడల్ థాట్స్ అత్యధికంగా వస్తున్నట్లు తేలింది. అయితే ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదని, బతికే జీవితం ద్వారానే విజయాన్ని సాధించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
పరిశోధన ఏం చెబుతోంది?
నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్, అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ, బ్రిటన్‌లో నాటింగ్‌హామ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సైకాలజీ కలిసి ఈ అధ్యయనం నిర్వహించాయి. ఆరు సంవత్సరాల పాటు 10 వేల మందిపై సర్వే చేసి, సూసైడ్ ఆలోచనలు ఎప్పుడు, ఎందుకు వస్తాయన్న అంశాలపై విశ్లేషించారు.
ఇప్పటివరకు చలికాలంలోనే సూసైడ్ కేసులు ఎక్కువగా ఉంటాయని భావించగా.. వాస్తవానికి వసంత కాలం లేదా వేసవి ప్రారంభంలోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య ఈ ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. డిసెంబర్‌లో ఈ కేసులు అత్యధికంగా ఉండగా, జూన్ నెలలో తక్కువగా ఉంటాయని వెల్లడైంది.
సూసైడ్ ఆలోచనలకు కారణాలేంటి?
మానసిక నిపుణుల ప్రకారం.. సూసైడల్ థాట్స్ వెనుక ప్రధానంగా మూడు రకాల కారణాలు ఉంటాయి.
శారీరక కారణాలు – మెదడులో సెరోటోనిన్ వంటి హార్మోన్ల అసమతుల్యత
మానసిక కారణాలు – వ్యక్తి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం
సామాజిక కారణాలు – ఒంటరితనం, కుటుంబ సమస్యలు, ఒత్తిడి
ఈ మూడు కారణాలు విడివిడిగా కాకుండా కలిసే ఒక వ్యక్తిని తీవ్ర మానసిక సంక్షోభానికి గురిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సూసైడ్ థాట్స్ నుంచి బయటపడాలంటే?
ఈ ఆలోచనలకు సరైన “వ్యాక్సినేషన్” ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అది ఇంకేదీ కాదు – నలుగురితో కలవడం, ఆనందంగా జీవించడం. సామాజికంగా కలిసిమెలిసి ఉండటం, మనసులోని బాధలను పంచుకోవడం ఈ ఆలోచనలను దూరం చేయడంలో కీలకంగా పనిచేస్తాయి.
ఎవరికైనా నిరాశ, నిద్రలేమి, ఆకలి లేకపోవడం, చిరాకు, తీవ్రమైన స్పందనలు కనిపిస్తే వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి.
“ఓడిపోయానంటే జీవితం ముగిసినట్టే” అనే భావన నుంచి యువతను బయటకు తీసుకురావాలి. ఓటమిని ధైర్యంగా ఎదుర్కొనేలా మానసికంగా బలపరచాలి.
కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ విషయాలపై ఓపెన్‌గా చర్చ జరగాలి. అది వారికి మానసిక మద్దతును ఇస్తుంది.