వర్షాకాలంలో జలుబు, జ్వరం ఇబ్బందిస్తున్నాయా? ఒక్క స్పైసీ వెల్లుల్లి కారం చాలు.. సమస్యలన్నీ పారిపోతాయి!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. వాతావరణ మార్పులతో పాటు జలుబు, దగ్గు, జ్వరం లాంటి వైరల్ ఫీవర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాకాలంలో జలుబు, జ్వరం ఇబ్బందిస్తున్నాయా? ఒక్క స్పైసీ వెల్లుల్లి కారం చాలు.. సమస్యలన్నీ పారిపోతాయి!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. వాతావరణ మార్పులతో పాటు జలుబు, దగ్గు, జ్వరం లాంటి వైరల్ ఫీవర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ మందులు తీసుకోకుండా కూడా ఉపశమనం పొందే ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది – అదే స్పైసీ వెల్లుల్లి కారం. ఇది గొంతు నొప్పి, దగ్గు, జలుబు లాంటి సమస్యలను తగ్గించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కావలసిన పదార్థాలు:
వెల్లుల్లి రెబ్బలు – 20 నుండి 30
లవంగాలు – 2
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర – 2 టీస్పూన్లు
ఆవాలు – 2 టీస్పూన్లు
మినపప్పు – 2 టీస్పూన్లు
కరివేపాకు – గుప్పెడు
కారం – 2 టీస్పూన్లు
నూనె – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం:
వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసకుండా రోటీలో దంచి పక్కన పెట్టాలి. (మిక్సీలో కాకుండా రోటీలో దంచితే వెల్లుల్లి ఘాటు, రుచి బాగా వస్తాయి.)
ఒక కళాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో జీలకర్ర, ఆవాలు, లవంగాలు, మినపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంకా 5-6 వెల్లుల్లి రెబ్బలు (పొట్టు తీసినవి) వేసి బాగా వేయించాలి.
స్టవ్ ఆఫ్ చేసి, ఈ తాలింపును ముందే దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్‌లో వేసి కలపాలి.
అందులో కారం, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇంతే… వేడి వేడిగా స్పైసీ వెల్లుల్లి కారం రెడీ!
గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే, ఇది కొన్ని రోజులు అలాగే నిల్వ ఉంటుంది.
ప్రయోజనాలు:
దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గిస్తుంది
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
జ్వరం సమయంలో శరీరానికి శక్తినిస్తుంది
అందుకే పెద్దవాళ్లు, ముఖ్యంగా వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ముందుగా గుర్తు చేసుకునేది ఈ వెల్లుల్లి కారంనే.