Diabetes: డయాబెటిస్ వచ్చిందని చర్మమే చెబుతుందా? ఈ ప్రారంభ సంకేతాలను గుర్తించండి !
Diabetes: డయాబెటిస్ వస్తే కేవలం బాడీ పార్ట్స్‌పైనే కాదు, చర్మం మీద కూడా దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది.
Diabetes : డయాబెటిస్ వచ్చిందని చర్మమే చెబుతుందా? ఈ ప్రారంభ సంకేతాలను గుర్తించండి !
Diabetes: డయాబెటిస్ వస్తే కేవలం బాడీ పార్ట్స్‌పైనే కాదు, చర్మం మీద కూడా దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. నిజానికి చాలా మందికి డయాబెటిస్ వచ్చిందని మొదట చర్మం ద్వారానే తెలుస్తుంది. మరి డయాబెటిస్ వచ్చినప్పుడు చర్మంపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? వాటిని ఎలా గుర్తించాలి? ఎలా కాపాడుకోవాలో తెలుసకుందాం.
డయాబెటిస్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. మారిన లైఫ్‌స్టైల్, ఆహారం వల్ల ఈ వ్యాధి ఇప్పుడు యువతను కూడా వదిలిపెట్టడం లేదు. డయాబెటిస్ వస్తే దాని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది. చర్మం పొడిబారడం, కాళ్లపై మచ్చలు రావడం, డార్క్ ప్యాచెస్ ఏర్పడటం, ఎర్రటి దద్దుర్లు రావడం, చర్మం నల్లగా మారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ మీ చర్మంపై ఇలాంటి మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి.
చర్మంపై కనిపించే ప్రభావాలు ఇవే
ఆర్ఎంఎల్ హాస్పిటల్‌లోని డెర్మటాలజీ డిపార్ట్‌మెంట్ మాజీ డాక్టర్ భావుక్ ధీర్ చెప్పినదాని ప్రకారం..డయాబెటిస్ వచ్చిన మొదట్లో సాధారణంగా రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్‌కు వెళ్లాల్సి రావడం ఒక ప్రధాన లక్షణం. దీంతో పాటు డయాబెటిస్ స్టార్టింగ్ స్టేజ్‌లో చర్మంపై కూడా లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపై చాలా రకాల మార్పులు కనిపిస్తాయి. చర్మం పొడిబారడం, చాలా చోట్ల ఎర్రటి దద్దుర్లు రావడం. వాటిలో నొప్పి, దురద కూడా ఉంటాయి.
దీంతో పాటు చంకల్లో, మెడలో, మరికొన్ని చోట్ల చర్మం నల్లగా మారుతుంది. దీన్ని అకాంథోసిస్ నిగ్రికాన్స్ అంటారు. చేతులకు, కాళ్లకు చిన్నచిన్న బొబ్బలు కూడా రావచ్చు. కాలి బొటనవేలికి, వేళ్లకు పుండ్లు లేదా అల్సర్లు రావచ్చు. డయాబెటిస్ వల్ల గ్యాంగ్రీన్ కూడా వస్తుంది. దీనికి ట్రీట్‌మెంట్ లేదు. అంతేకాదు చర్మం కూడా పల్చగా మారొచ్చు.
వెంటనే ఇలా చేయండి
మీ చర్మంపై పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ షుగర్ లెవెల్స్‌ను చెక్ చేయించుకోండి. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్‌ను కలిసి డయాబెటిస్ మేనేజ్‌మెంట్ కోసం మందులు వాడడం మొదలు పెట్టండి. వేడి నీళ్లతో స్నానం చేయకండి. దాని వల్ల చర్మం ఇంకా పొడిబారుతుంది. చర్మానికి మాయిశ్చరైజర్ రాయండి. చర్మం దురదగా ఉంటే గోకకండి. దాని వల్ల సమస్య ఇంకా ఎక్కువవుతుంది. మీ కాళ్లను ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచుకోండి. మీ డైలీ రొటీన్, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి.