Showering At Night: మీకు రాత్రి స్నానం చేసే అలవాటు ఉందా? దాని ప్రయోజనాలను తెలుసుకోండి..
Showering At Night: తరచుగా కొంతమంది రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తారు.
Showering At Night: మీకు రాత్రి స్నానం చేసే అలవాటు ఉందా? దాని ప్రయోజనాలను తెలుసుకోండి..
Showering At Night: తరచుగా కొంతమంది రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తారు. అయితే, ఇంటి పెద్దలు రాత్రి స్నానం చేయడం మంచిది కాదని అంటారు. కానీ, రాత్రి స్నానం చేసి నిద్రపోవడం వల్ల మీరు తాజాగా ఉండటమే కాకుండా, అలసట కూడా తగ్గుతుంది. ఇది ఆరోగ్యం, నిద్రపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. స్నానం శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మానసికంగా రిలాక్స్ చేస్తుంది.
బయట తిరిగిన తర్వాత ధూళి, మలినాలు శరీరానికి అంటుకుని ఉంటాయి. వాటిని తొలగించడానికి రాత్రి స్నానం ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రం ప్రకారం, రాత్రి స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి, రాత్రి స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
- రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది.
- చల్లని లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా ఉన్న ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది.
- రోజంతా బయట ఉండటం వల్ల శరీరంపై దుమ్ము, చెమట పేరుకుపోతాయి. రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
- రాత్రి స్నానం చేయడం వల్ల శరీర దుర్వాసన తొలగిపోయి తాజా అనుభూతి కలుగుతుంది.
- మీరు రోజంతా మేకప్‌లో లేదా ఎండలో ఉంటే, రాత్రి స్నానం చేయడం వల్ల మీ చర్మం తాజాగా ఉంటుంది.
- రాత్రిపూట గోరువెచ్చని లేదా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మైగ్రేషన్, తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. స్నానం చేసిన తర్వాత మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
- రాత్రి పడుకోవడానికి గంట ముందే స్నానం చేయడం ఉత్తమం. దీనివల్ల శరీరం చల్లబడటానికి సమయం లభిస్తుంది. తర్వాత హాయిగా నిద్ర వస్తుంది.
రాత్రి స్నానం చేయడానికి సరైన మార్గం
- వేసవికాలంలో చల్లని లేదా సాధారణ నీటితో స్నానం చేయండి. శీతాకాలంలో గోరువెచ్చని నీటిని వాడండి.
- రాత్రిపూట ఎక్కువ రసాయనాలు కలిగిన సబ్బులతో స్నానం చేయవద్దు. ఇది మీ చర్మాన్ని పొడిగా చేస్తుంది.
- రాత్రి స్నానం చేసిన తర్వాత చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడం ముఖ్యం, దీని కోసం స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాయండి.
- పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు విశ్రాంతి పొందుతాయి.