Chicken Price: కొండెక్కిన చికెన్ ధర

20 రోజుల్లో కిలోకు రూ.100 పెరుగుదల నిన్న 15లక్షల కిలోల చికెన్ తిన్న జనాలు.

Update: 2022-03-07 03:59 GMT

Chicken Price: కొండెక్కిన చికెన్ ధర

Chicken Price: చికెన్ ధర బాగా పెరుగుతోంది. 20 రోజుల క్రితం కిలో 175 రూపాయలుండగా.. ప్రస్తుతం 280కి చేరుకుంది. అయితే ఇంకా పెరిగే అవకాశముందని కోళ్ల పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నిన్న ఒక్కరోజే 15 లక్షల కిలోల చికెన్ ను జనాలు తిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కరోనా భయం తగ్గడంతో పది రోజుల్లో రోజుకు అదనంగా లక్ష నుంచి 2లక్షల కిలోల చికెన్ అమ్మకాలు పెరిగాయి.

నాటుకోడి మాంసం కిలో 400 నుంచి 500కి చేరింది. నాటుకోళ్ల లభ్యత లేకపోవడంతో ధర పెరుగుతోంది. మధ్యప్రదేశ్ అడవుల్లో పెరిగే కడక్ నాథ్ కోళ్లను కొందరు వ్యాపారులు తెచ్చి.. ఇక్కడి ఫారాల్లో పెంచి కిలో మాంసం 500కి అమ్ముతున్నారు. ఈ మాంసంలో పోషకాలుంటాయనే ప్రచారంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తుండటంతో దీని ధర కూడా పెరుగుతోంది.

Tags:    

Similar News