Skincare : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం రైస్ వాటర్.. కానీ, దీన్ని అందరూ వాడొచ్చా? నిపుణులు ఏమన్నారంటే..
Skincare: కొరియన్ స్కిన్ కేర్ అంటే చాలు.. మనకు గుర్తొచ్చేది నిగనిగలాడే, మచ్చలేని గ్లాస్ స్కిన్.
Skincare: కొరియన్ స్కిన్ కేర్ అంటే చాలు.. మనకు గుర్తొచ్చేది నిగనిగలాడే, మచ్చలేని గ్లాస్ స్కిన్. ఈ విధమైన చర్మం పొందడానికి చాలామంది కొరియన్ మహిళలు బియ్యం నీటిని ఒక బ్యూటీ సీక్రెట్‌గా ఉపయోగిస్తారు. ఇది కేవలం కొరియాలోనే కాకుండా, చైనా, జపాన్‌లో కూడా చాలా కాలంగా వాడుకలో ఉంది. ఇప్పుడు ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. అయితే, ఈ బియ్యం నీటిని వాడటం వల్ల ఎలాంటి లాభాలు, నష్టాలు ఉన్నాయి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బియ్యం నీటిలో ఉండే పోషకాలు
బియ్యం నీటిని ఒకప్పుడు అనవసరమైనదిగా భావించేవారు. కానీ, అందులో ఉండే పోషక విలువలు చాలా ఎక్కువ. బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్ B, విటమిన్ E, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. మచ్చలేని చర్మం పొందడానికి సహాయపడుతుంది.
రోజూ వాడొచ్చా?
కొరియన్ చర్మం, భారతీయ చర్మం చాలా భిన్నంగా ఉంటాయి. కొరియన్ చర్మం పలుచగా ఉంటే, భారతీయ చర్మం కొంచెం మందంగా ఉంటుంది. అందువల్ల, బియ్యం నీటిని రోజూ వాడటం మంచిది కాదని ఆమె సూచించారు. దీన్ని వారంలో 2-3 రోజులు మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు.
బియ్యం నీటితో కలిగే ప్రయోజనాలు
బియ్యం నీటిని వాడటం వల్ల చర్మంపై ఉన్న మచ్చలు తగ్గుతాయి, చర్మం క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది చర్మాన్ని సాఫ్ట్‌గా, షైనీగా ఉంచడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వాడితే, ఇది చర్మానికి గ్లాస్ లాంటి మెరుపును ఇస్తుంది. బియ్యం నీటిని తయారు చేయడం, వాడటం చాలా సులభం. బియ్యాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో వేసి ముఖంపై స్ప్రే చేసుకోవచ్చు లేదా దూదితో కూడా అప్లై చేసుకోవచ్చు. రోజూ ఉదయం నిద్రలేవగానే ముఖం కడుక్కున్న తర్వాత దీన్ని అప్లై చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వారు తెలిపారు. అంతేకాకుండా, వారంలో 2-3 రోజులు మాత్రమే వాడటం ఉత్తమం.