క్యారెట్‌తో ముఖంపై నల్లమచ్చలని తొలగించండి.. ఫేస్‌ని అందంగా మార్చుకోండి..!

క్యారెట్‌తో ముఖంపై నల్లమచ్చలని తొలగించండి.. ఫేస్‌ని అందంగా మార్చుకోండి..!

Update: 2023-02-20 16:00 GMT

క్యారెట్‌తో ముఖంపై నల్లమచ్చలని తొలగించండి.. ఫేస్‌ని అందంగా మార్చుకోండి..!

Skin Care Tips: ప్రతి ఒక్కరూ అందమైన చర్మాన్ని పొందాలని కోరుకుంటారు. అందుకే మార్కెట్‌లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ని వాడుతారు. వీటికోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెడుతారు. కానీ వీటివల్ల అందంగా తయారవడం ఏమోకానీ దుష్పభావాలు మాత్రం కచ్చితంగా వస్తాయి. అందుకే ఇంట్లోనే కొన్ని పద్దతుల ద్వారా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. అలాంటి వాటిలో క్యారెట్ ఫేస్ ప్యాక్ ఒకటి.

క్యారెట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది చర్మానికి ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుతుంది. ముఖంపై మొటిమలు లేదా నల్ల మచ్చల సమస్య ఉంటే క్యారెట్ వాటికి దివ్యౌషధంగా చెప్పవచ్చు. అయితే క్యారెట్ ఫేస్ ప్యాక్ ఎలా తయారుచేయాలో ఈరోజు తెలుసుకుందాం.

క్యారెట్ ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా క్యారెట్ తీసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. తర్వాత అందులో 2-3 స్పూన్ల తేనెను కలపాలి. తర్వాత రెండింటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు మచ్చలేని చర్మం కోసం క్యారెట్ ఫేస్ ప్యాక్ సిద్ధంగా ఉంది. దీనిని అప్లై చేసేముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. తర్వాత ఈ పేస్ట్‌ని ముఖం, మెడపై అప్లై చేయాలి. తరువాత సుమారు 10-15 నిమిషాలు అప్లై చేసి ఆరనివ్వాలి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని తర్వాత ముఖంపై ఏదైనా లోషన్ లేదా క్రీమ్ రాయడం మర్చిపోవద్దు.

Tags:    

Similar News