Men And Women: అబ్బాయిలు అమ్మాయిల కంటే ఎందుకు ఎత్తుగా ఉంటారో తెలుసా..!

Men And Women: పురుషులు సాధారణంగా స్త్రీల కంటే ఎత్తుగా ఉంటారు. చూసేవారికి ఇది సాధారణమే అనిపించవచ్చు.

Update: 2025-05-26 11:27 GMT

Men And Women: అబ్బాయిలు అమ్మాయిల కంటే ఎందుకు ఎత్తుగా ఉంటారో తెలుసా..!

Men And Women: పురుషులు సాధారణంగా స్త్రీల కంటే ఎత్తుగా ఉంటారు. చూసేవారికి ఇది సాధారణమే అనిపించవచ్చు. కానీ, దీని వెనుక ఉన్న అసలు కారణం ఎవరికీ తెలియదు. చాలా మంది ఇది సహజమైన ప్రక్రియ అని అనుకుంటారు. అయితే, ఈ వ్యత్యాసం వెనుక ఆసక్తికరమైన జీవసంబంధమైన, జన్యుపరమైన కారణాలు ఉన్నాయని ఇటీవలి శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

పురుషులు, స్త్రీల మధ్య సగటు ఎత్తు వ్యత్యాసం దాదాపు 5 అంగుళాలు అని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తల బృందం 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వ్యక్తుల DNA డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించింది.

పురుషులకు XY క్రోమోజోములు ఉంటాయి. స్త్రీలకు XX క్రోమోజోములు ఉంటాయి. SHOX (షార్ట్ స్టెచర్ హోమియోబాక్స్) అనే జన్యువు Y క్రోమోజోమ్‌పై ఉండి ఎముకల పెరుగుదల, శరీర పొడవును ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ SHOX జన్యువు స్త్రీలలో కూడా ఉంటుందని.. కానీ, ఇది కేవలం పురుషులలోనే ఎక్కువగా చురుకుగా ఉంటుందని చెబుతున్నారు. Y క్రోమోజోమ్ ఉండటం వల్ల SHOX జన్యువు మరింత ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారు. అందువల్ల, పురుషులలో ఎత్తు మరింత పెరుగుతుంది. పురుషులలో దాదాపు 25 శాతం ఎత్తు పెరగడానికి ఈ జన్యువు కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

జన్యుపరమైన కారణాలతో పాటు హార్మోన్ల ప్రభావాలు, యుక్తవయస్సు సమయంలో శరీర పెరుగుదల, ఎముకల సాంద్రత ఎత్తును ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు, మహిళల శరీరంలోని ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఎముకల పెరుగుదలను నియంత్రిస్తుంది.

Tags:    

Similar News