Hair Loss: ఈ చెడ్డ అలవాట్లని వదిలివేయండి.. జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది..!

Hair Loss: వృద్ధాప్యంలో జుట్టు రాలడం సహజం. కానీ ఇప్పుడు చిన్న వయస్సులోనే తలపై జుట్టు మొత్తం రాలిపోతుంది...

Update: 2022-05-19 11:30 GMT

Hair Loss: ఈ చెడ్డ అలవాట్లని వదిలివేయండి.. జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది..!

Hair Loss: వృద్ధాప్యంలో జుట్టు రాలడం సహజం. కానీ ఇప్పుడు చిన్న వయస్సులోనే తలపై జుట్టు మొత్తం రాలిపోతుంది. దీనివల్ల వారు బయట తిరగలేకపోతున్నారు. బట్టతల రావడంతో ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఇలా జరగడం వెనుక చాలా కారణాలున్నాయి. ఈ రోజు మనం వాటన్నింటి గురించి తెలుసుకుందాం.

ధూమపానం మానుకోండి

స్మోకింగ్ అనేది నేటి ఆధునిక యువతలో ఫ్యాషన్ ట్రెండ్‌గా మారుతోంది. అయితే ధూమపానం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. అంతేకాదు ఇది జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతోంది. నిజానికి ధూమపానం తలలో రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. ఇది జుట్టు సహజ పెరుగుదలను నేరుగా ప్రభావితం చేస్తుంది.

జుట్టును బలంగా రుద్దకండి

తలపై వెంట్రుకలు చాలా సున్నితమైన భాగం. వాటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తలస్నానం చేసేటప్పుడు సబ్బు లేదా షాంపూ రాసుకున్నప్పుడు జుట్టును గట్టిగా రుద్దుకూడదు. నెమ్మదిగా షాంపూ చేయండి. నూనెను రాసేటప్పుడు కూడా జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి. జుట్టును ఎక్కువగా లాగడం లేదా రుద్దడం వల్ల వాటి మూలాలు బలహీనపడతాయి. దాని కారణంగా అవి ఊడిపోవడం ప్రారంభమవుతాయి.

ప్రతి వారం రంగులు వేయవద్దు

ఈ రోజుల్లో స్టైలిష్‌గా మారడానికి జుట్టుకి రకరకాల రంగులు వేస్తున్నారు. కానీ ఈ ధోరణి జుట్టు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. వాస్తవానికి మీరు ప్రతి వారం జుట్టుకు రంగు వేసుకుంటే, అది జుట్టు మూలాన్ని బలహీనపరుస్తుంది. హెయిర్ ఫోలికల్స్ పొడిగా మారతాయి. దీని కారణంగా జుట్టు వేగంగా ఊడిపోతుంది. కాబట్టి మీ జుట్టుకు రంగు వేయడానికి బదులుగా హెన్నాను అప్లై చేయడానికి ప్రయత్నించండి.

Tags:    

Similar News