దగ్గు వస్తుందా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలి

ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య జ్వరంతో పాటు దగ్గు.. వీటితో చాలా మంది బాధపడుతున్నారు. కొంత మందిని

Update: 2019-10-18 06:47 GMT

ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య జ్వరంతో పాటు దగ్గు.. దీంతో చాలా మంది బాధపడుతున్నారు. కొంత మందిని ఇది కొన్ని రోజులు పాటు వేధిస్తే మరికొంత మందిని సుధిర్ఘకాలంగా వేధిస్తుంటుంది. కొందరికి దగ్గినప్పుడు కళ్లె పడుతుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు. దీనికి పరిష్కారమేంటో చూద్దాం

దగ్గు రావటానికి ఇన్‌ఫెక్షన్లు, ఆస్థమా, అలర్జీ వంటి రకరకాల అంశాలు ఉంటాయి. కాబట్టి సమస్యకు మూలం ఏంటన్నది తెలుసుకొని చికిత్స తీసుకుంటే మంచిది. అలక్ష్యం చేస్తే బి కణాలు నిర్వీర్యం అవుతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పెరుగుతుంది. ముఖ్యంగా టి కణాల సామర్థ్యం తగ్గిపోతే క్షయ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.మధుమేహం ఉన్నవారు దగ్గుతో బాధపడితే వారికి క్షయ వ్యాధి వచ్చే అవకాశముంది.

దగ్గు ఎక్కువ రోజులు ఉంటేఛాతీ వ్యాధుల నిపుణులను సంప్రదించటం మంచిది. మీకు ముందుగా ఛాతీ ఎక్స్‌రే తీసి పరిశీలించాల్సి ఉంటుంది. అవసరమైతే కళ్లె పరీక్ష చేయించుకోవాలి. మామూలు ఇన్‌ఫెక్షన్‌ లాటింది అయితే యాంటీబయోటిక్స్‌తో దగ్గు తగ్గిపోతుంది. అదే క్షయ అని తేలితే తగు చికిత్స తీసుకోవాలి. ఇంట్లో బూజు దులపటం, అటకలు శుభ్రం చేయటం, బొద్దింకలను కోసం ఉపయోగించే స్ప్రేలు చల్లటం, ఆసిడ్‌తో బాత్రూమ్‌ శుభ్రం చేయటం వంటివి దగ్గు రావడం కారణమవుతాయి. కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. 

Tags:    

Similar News