Beauty tips: బంగాళదుంప రసం మీ చర్మంపై ఉండే ముడతలను పోగొడుతుంది
Beauty tips: ఇప్పుడు చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా చర్మంపై ముడుతలు వస్తున్నాయి. మరికొంతమందికైతే ముఖంపై చర్మం మరింత జారీపోయినట్లు అవుతుంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కుంటున్న వాళ్లు ఇంట్లో దొరికే వాటితో తగ్గించుకోవచ్చని బ్యూటీ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

బంగాళదుంప రసంతో లాభాలెన్నో..
బంగాళ దుంప రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్లు, ఫ్రీరాడికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రసాన్ని ముఖంపై అప్లై చేస్తే చర్మంపై కలిగే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ముడతలను రాకుండా ఆపుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. బంగాళ దుంప రసం నేచురల్ బ్లీచింగ్‌లా పనిచేస్తుంది. కెమికల్ ఉండే బ్లీచింగ్ కంటే ఇలా నేచురల్ బ్లీచింగ్ వేసుకోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది. పొడి చర్మం, ముడతలు, మచ్చలు, వాపు వంటివి ఉన్నవారు ఈ రసాన్ని అప్లై చేయడం వల్ల అన్నీ తగ్గిపోతాయి.
ఇలాంటి ప్యాక్స్ మీ ముఖానికి వేసి చూడండి..
బంగాళ దుంప రసాన్ని సాధారణంగా స్కిన్ టైటినింగ్ ప్యాక్‌లో వాడుతుంటారు. దుంపను ఉడకబెట్టి , అందులో కాస్త పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్ ను వారానికి ఒకసారి ముఖానికి పెట్టుకుంటే స్కిన్ రీఫ్రెషై ముడతలు రాకుండా కాపాడుతుంది.
పచ్చి బంగాళ దుంపను చిన్న చిన్న ముక్కలుగా చేసి, కాస్తంత నీళ్లు కలిపి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత దీన్ని ఒక గుడ్డలో వేసి గట్టిగా ముడి వేయాలి. ఇలా చేసేటప్పడు వచ్చిన రసాన్ని తీసుకుని అందులో కాస్తంత తేనె, రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పదిహేనురోజులకు ఒకసారి ఇలా చేయడం వల్ల చర్మం జారకుండా ఉంటుంది.
బంగాళదుంపను ఉడకబెట్టి మెత్తగా పేస్ట్‌లా చేయాలి. దీనికి కాస్త శనగపిండి, పసుపు కలిపి ముఖానికి రాసి, అరగంట తర్వాత స్నానం చేస్తే ముఖం మెరిసిపోతుంది. అలాగే ముఖంపై ఉండే చర్మం బిగుతుగా మారుతుంది.