ఆరోగ్యానికి అందానికి ఒక్కటే పండు దానిమ్మ.. ఇలా ఉపయోగించండి..!

* ఇందులో ఉండే గుణాలు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా మేలు చేస్తాయి.

Update: 2022-11-06 06:28 GMT

ఆరోగ్యానికి అందానికి ఒక్కటే పండు దానిమ్మ.. ఇలా ఉపయోగించండి..!

Pomegranate: దానిమ్మలో అద్బుతమైన పోషకాలు దాగి ఉన్నాయి. ఇది మన శరీరంలో రక్తాన్ని పెంచడానికి పనిచేస్తుంది. ఇందులో ఉండే గుణాలు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా మేలు చేస్తాయి. కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు దానిమ్మలో విరివిగా ఉంటాయి. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. దీని వాడకం వల్ల చర్మం మెరిసిపోతుంది. అంతే కాదు దానిమ్మ చర్మానికి సంబంధించిన మొటిమలు, ముడతల సమస్యలను తొలగిస్తుంది. చర్మాన్ని అందంగా మార్చుకోవాలంటే దానిమ్మని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు.

దానిమ్మ చర్మానికి చాలా మేలు చేస్తుంది. దీనిని బ్యూటీ ప్రొడాక్ట్స్‌లో వాడుతారు. దీని రసం నుంచి నూనె వరకు అన్నీ చర్మానికి మేలు చేస్తాయి. దానిమ్మ నూనె శరీరానికి అప్లై చేయడం వల్ల చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చు. చర్మానికి మాయిశ్చరైజర్‌కు బదులుగా దానిమ్మ నూనెను వాడితే చర్మం మెరుస్తుంది. దానిమ్మ మంచి టోనర్‌గా కూడా పనిచేస్తుంది. దానిమ్మ గింజలను పేస్ట్ లా చేసి చర్మానికి రాసుకుంటే అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి.

ముఖంలో మెరుపు రావాలంటే దానిమ్మ గింజలను పేస్ట్ లా చేసి అప్లై చేసుకోవాలి. ఈ పేస్ట్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. ఇలా చేస్తే రక్తం శుద్ధి అయి ముఖంలో మెరుపు వస్తుంది. ముఖ సమస్యల నుంచి బయటపడాలంటే వెంటనే దానిమ్మ రసం తాగడం ప్రారంభించండి. దానిమ్మ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలో ఉండే విటమిన్ సి చర్మానికి చాలా మేలు చేస్తుంది. దానిమ్మలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలను తొలంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

Tags:    

Similar News