Mosquitoes: దోమలకు చెక్ పెట్టాలా.. ఇంట్లో ఈ 3 మొక్కలను నాటండి..!
Mosquitoes: వర్షాకాలంలో కీటకాలు, దోమల బెడద పెరుగుతుంది. ఈ కీటకాలు దురదను కలిగిస్తాయి.
Mosquitoes: దోమలకు చెక్ పెట్టాలా.. ఇంట్లో ఈ 3 మొక్కలను నాటండి..!
Mosquitoes: వర్షాకాలంలో కీటకాలు, దోమల బెడద పెరుగుతుంది. ఈ కీటకాలు దురదను కలిగిస్తాయి. ఇది డెంగ్యూ, మలేరియా లేదా చికున్‌గున్యా వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. దోమలను తక్షణమే తరిమికొట్టడానికి పురుగుమందుల స్ప్రేలు, రసాయన మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి ద్వారా విడుదలయ్యే రసాయనాలు ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, మీరు వ్యాధులను నివారించడానికి సహజంగానే దోమలు, కీటకాల బెడదను తగ్గించవచ్చు. దీని కోసం మీరు ఇంట్లో కొన్ని ప్రత్యేక మొక్కలను నాటండి. ఈ మొక్కలు మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, గాలిని తాజాగా చేస్తాయి.
సిట్రోనెల్లా:
నిమ్మకాయ మొక్కను దోమలను తరిమికొట్టడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్కను కిటికీల దగ్గర లేదా బాల్కనీలలో ఎండ పడే ప్రదేశాలలో పెంచవచ్చు. ఈ మొక్క ఇంట్లో ఉంటే దోమల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే, దోమలకు నిమ్మకాయ వాసన అంటే అస్సలు ఇష్టం ఉండదు.
లావెండర్:
దోమలు లావెండర్ వాసనను ఇష్టపడవు. కాబట్టి, దోమలను తరిమికొట్టడానికి ఇది ఒక గొప్ప మార్గం. దోమలను తరిమికొట్టడానికి, తీపి సువాసనను వెదజల్లడానికి మీరు ఈ మొక్కను మీ ఇంటి లోపల నాటండి. దెబ్బకు దోమలు పరార్ అవుతాయి.
పుదీనా:
పుదీనా ఆకులను ఆహారంలోనే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. దీని వాసన దోమలను తరిమికొట్టడానికి కూడా సహాయపడుతుంది. దీని రిఫ్రెషింగ్ ప్రభావం గాలిని తాజాగా చేస్తుంది. దీని బలమైన, ఘాటైన వాసన, ముఖ్యంగా మెంథాల్, కీటకాలను ఇంటి నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.