EGG: ఆ వ్యాధి ఉన్నవారు గుడ్డు తినకూడదు.. ఎందుకంటే..?

EGG: ఆ వ్యాధి ఉన్నవారు గుడ్డు తినకూడదు.. ఎందుకంటే..?

Update: 2022-02-22 08:00 GMT

EGG: ఆ వ్యాధి ఉన్నవారు గుడ్డు తినకూడదు.. ఎందుకంటే..?

EGG: సాధారణంగా గుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందకే వైద్యులు అన్ని సీజన్లలో గుడ్లు తినాలని సూచిస్తారు. రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ 60 శాతం పెరుగుతుందని ఒక పరిశోధనలో వెల్లడైంది. చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ 8,000 మందికి పైగా గుడ్లు తినే వారిపై ఒక పరిశోధన చేసింది. కానీ వీరి శారీరక శ్రమ తక్కువ. దీంతో వారి రక్తంలో సీరమ్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి.

గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలిన్ ఆక్సీకరణ, వాపు ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది గుడ్డులోని తెల్లసొనలో ఉండే రసాయనాల నుంచి కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అల్పాహారం ఎంపికలలో గుడ్డు ఒకటి. ఇది ప్రోటీన్‌కి గొప్ప మూలం. గుడ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఒక పెద్ద గుడ్డులో దాదాపు 200 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు నష్టమని చెబుతున్నారు.

గుడ్లు తినడానికి ఉత్తమ మార్గం వాటిని ఉడకబెట్టడం, ఉప్పు, మిరియాలు, కొత్తిమీర ఆకులతో తింటే ఆరోగ్యానికి మంచిది. మీరు రెండు గుడ్లను ఉపయోగించి కూరగాయల ఆమ్లెట్‌ని కూడా తయారు చేసుకోవచ్చు. గుడ్డు సామాన్యుడి ఉన్నతమైన ఆహారం. తక్కువ ధరలో లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తింటారు. మధుమేహ వ్యాధి ఉన్నవారు గుడ్డుని ప్రతిరోజు తీసుకోకుండా కొంచెం గ్యాప్‌ ఉండేలా చూసుకుంటే మంచిది.

Tags:    

Similar News