Paan Benefits: ఒక్క ఆకు 100 అద్భుతాలు.. ఇలా తింటే నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..!

Paan Health Benefits: తమలపాకులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మన పూర్వీకుల కాలం నుండి తమలపాకును తినే అలవాటు ఉంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే తమలపాకు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..

Update: 2025-04-12 10:16 GMT

Paan Benefits: ఒక్క ఆకు 100 అద్భుతాలు.. ఇలా తింటే నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..!

Paan Health Benefits: తమలపాకుని పాన్‌ అని కూడా పిలుస్తారు. ఇందులో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది నోటి ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే ఏదైనా భోజనం చేయగానే తమలపాకు తినే సాంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలో ఈ తమలపాకును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..

తలనొప్పి..

తమలపాకును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల నివేదికల ప్రకారం ఇది తలనొప్పిని తగ్గించేస్తుంది. ఎందుకంటే ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి. ఇది స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పిని శాశ్వతంగా తగ్గించేస్తుంది.

స్ట్రెస్..

తమలపాకును రెగ్యులగా తీసుకోవడం వల్ల ఇది యాంగ్జైటీ, స్ట్రెస్ కూడా తగ్గించేస్తుంది. ఇందులో స్ట్రెస్‌ తగ్గించి.. మన మూడ్ బూస్టింగ్‌ చేసే గుణాలు కలిగి ఉంటుంది. తద్వారా యాంగ్జైటీకి గురికాకుండా కూడా ఉంటారు. అంటే ఇది మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

తమలపాకులో వాత పితా కఫ దోషాలకు చెక్ పెట్టే లక్షణాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కడుపులో పీహెచ్ స్థాయిలను సమతూలం చేస్తుంది. దీంతో పేగు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్పొచ్చు. తమలపాకును భోజనం చేసిన తర్వాత తీసుకుంటాం. కాబట్టి ఇది జీర్ణాశయానికి మేలు దీంతో దోషాలు కూడా తగ్గిపోతాయి.

తమలపాకులో రొంప సమస్యలు తగ్గించే గుణం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది బ్రోన్కైటీస్‌, దగ్గు, జలుబు, ఆస్తమా వంటికి కూడా మంచి చికిత్సలో ఉపయోగిస్తారు. ఇందులో దగ్గు, జలుబు తగ్గించే గుణాలు కూడా కలిగి ఉంటాయి. ఆవనూనెతో కలిపి తమలపాకుని ఛాతి భాగంలో అప్లై చేయడం వల్ల రొంప సమస్యలు తక్షణమే తగ్గిపోతాయి.

మన డైట్‌లో తమలపాకులు చేర్చుకోవడం వల్ల ఇందులో కార్మినేటివ్ గుణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. తమలపాకులో యాంటీ సెప్టిక్ గుణాలు కూడా ఉంటాయి. ఇందులో పాలీఫెనల్స్ ఉంటాయి. మన కడుపులో మంచి బ్యాక్టిరియా పెరిగేలా ప్రేరేపిస్తుంది. రెగ్యులర్‌గా ఈ తమలపాకు తింటే ఆర్థరైటీస్ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు కూడా కలిగి ఉంటాయి. కాబట్టి తమలపాకును పేస్ట్ చేసి ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియాలో అప్లై చేయడం మంచిది.

Tags:    

Similar News