Lifestyle: 2050 నాటికి 60 శాతం మందిలో ఆ సమస్య.. షాకింగ్‌ విషయాలు

Obesity: ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లోని పిల్లలు ఈ సమస్య వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.

Update: 2025-03-10 14:08 GMT

Lifestyle: 2050 నాటికి 60 శాతం మందిలో ఆ సమస్య.. షాకింగ్‌ విషయాలు

Obesity: ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లోని పిల్లలు ఈ సమస్య వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. పరిశోధనల ప్రకారం పిల్లలతో పాటు పెద్దల్లో అధిక బరువు కేసులు 121 శాతం పెరిగినట్లు వెల్లడైంది.

జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో ఊబకాయం వేగంగా పెరుగుతోంది. ది లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అంటే సుమారు 60 శాతం మంది పెద్దలు అధిక బరువు సమస్యతో బాధపడతారని హెచ్చరిస్తున్నారు.

1990లో ప్రపంచవ్యాప్తంగా 92.9 కోట్ల మంది ఊబకాయంతో ఉండగా, 2021 నాటికి ఈ సంఖ్య 260 కోట్లకు చేరింది. ఈ సంఖ్య 2050 నాటికి 380 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చైనా, భారత్, అమెరికా, బ్రెజిల్, రష్యా, మెక్సికో, ఇండోనేషియా, ఈజిప్ట్‌ దేశాల్లో ఊబకాయుల సంఖ్య అధికంగా ఉందని స్పష్టం చేశారు.

ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా పరిశోధకులు కొన్ని విషయాలను పేర్కొన్నారు. వీటిలో ప్రధానమైనవి.. ఇంట్లో వండిన ఆహారాన్ని వదిలేసి ప్రాసెస్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్‌తీసుకోవడం. అధిక చక్కెర, కొవ్వు, రసాయనాలున్న ఆహారం తినడం. శారీరక వ్యాయామం లేకపోవడం. ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి వంటి సమస్యలు ఊబకాయానికి దారి తీస్తున్నాయని అంటున్నారు.

పరిష్కార మార్గాలు:

ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రజలు చక్కెర తీసుకోవడాన్ని తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోవాలి. ప్రభుత్వాలు సైతం కొన్ని రకాల చర్యలు చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. పార్కులు, వాకింగ్ ట్రాక్‌ల్లో ప్రజల కోసం తక్కువ ఖర్చుతో ఫిట్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. పిల్లలు, పెద్దలలో పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంచాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News