Nightmares: చెడ్డ, పీడ కలలు వస్తున్నాయా? కారణం ఇదే కావచ్చు..!
ఆరోగ్యం అంటేనే సంపద అంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం సరిగా పనిచేయగలం. అందులో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ చాలా అవసరం. వీటిలో రాత్రి భోజనం (డిన్నర్) ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది.
Nightmares: చెడ్డ, పీడ కలలు వస్తున్నాయా? కారణం ఇదే కావచ్చు..!
ఆరోగ్యం అంటేనే సంపద అంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం సరిగా పనిచేయగలం. అందులో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ చాలా అవసరం. వీటిలో రాత్రి భోజనం (డిన్నర్) ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. అయితే చాలా మంది రాత్రి భోజనం తర్వాత తీపి పదార్థాలు — కేకులు, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు లేదా పాల పదార్థాలు తినడం ఇష్టపడతారు. కానీ నిపుణులు చెబుతున్నట్లుగా, ఈ అలవాటు కొన్ని ప్రమాదాలను కలిగిస్తుంది.
పీడ కలలకు కారణం ఆహారమేనా?
కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీ ఒక అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రాత్రి పడుకునే ముందు పాల పదార్థాలు, తీపి వంటకాలు తినడం వల్ల పీడకలలు వస్తాయని గుర్తించారు. ముఖ్యంగా తీపి పదార్థాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. తరువాతి స్థానంలో పాల ఉత్పత్తులు ఉంటాయి.
ఎందుకు వస్తాయి చెడు కలలు?
ఆహార అలర్జీలు లేదా లాక్టోజ్ అసహనం (Lactose Intolerance) ప్రధాన కారణాలు.
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం.
ఆకలిని పట్టించుకోకపోవడం.
ఆందోళన, మానసిక ఒత్తిడి, దుఃఖం వంటివి కూడా భయంకర కలలకు కారణం అవుతాయి.
నాడీ వైద్యుల అభిప్రాయం ప్రకారం, మెదడు జ్ఞాపకాలను పదిలపరచుకునే సమయంలో కూడా పీడకలలు వస్తుంటాయి. అయితే, కలలు ఆహారాన్ని ప్రభావితం చేస్తున్నాయా లేదా ఆహారం కలలను మార్చేస్తుందా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.