Natural Henna: హెన్నా ఎలా తయారు చేసుకోవాలి తెలుసా!

Natural Henna: సహజ సిద్ధ పద్దతుల్లో తయారు చేసుకునే హెన్నా వాడుకోవడం మంచిది.

Update: 2021-04-28 09:00 GMT

హెన్నా (ఫైల్ ఇమేజ్)

Natural Henna: వయసుతో సంబంధం లేకుండా నేడు జట్టు తెల్లబడిపోతోంది. దానికి కారణం సమతులాహారం లేకపోవడం, పొల్యూషన్ వంటి కావచ్చు. లేదా దీర్ఘకాలిక జబ్బుల తాలూకా మందులు వాడటం, ఒత్తిడి, పొల్యూష్ వంటి వివిధ కారణాలతో చిన్న వయసులోనే జట్టు తెల్లబడుతోంది. మరికొంత మందికి వయసుతో పాటు వచ్చే సహజ పరిణామమే అయినా దాన్ని అలా స్వీకరించడానికి అందరూ సిద్ధంగా వుండరు. అలాంటి సమయంలో సహజ సిద్ధ పద్దతుల్లో తయారు చేసుకునే హెన్నా వాడుకోవడం మంచిది. మరి హెన్నా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందరికీ తెలిసిన విషయమే... కానీ మరోసారి మన "లైఫ్ స్టైల్" లో చేద్దాం.

హెన్నాతమారీ విధానం...

1. ఒక కప్పు నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల సహజసిద్ధంగా తయారు చేసిన గోరింటాకు పౌడర్ (ఫైన్ గా పౌడర్ చేసినది) పౌడర్ ని కలిపి ఎనిమిది గంటలు నానబెట్టండి. రాత్రంతా కూడా ఉంచవచ్చు.

2. మరునాడు పొద్దున్న రెండు టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులని నీటిలో మరిగించి ఆ నీటిని చల్లారనివ్వండి.

3. చల్లారాక, ఆ నీటిని హెన్నా పేస్ట్ లో కలపండి.

4. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి కలపండి.

5. అన్నీ బాగా కలిసి స్మూత్ పేస్ట్ వచ్చే వరకూ కలపండి.

6. చేతులకి గ్లోవ్స్ వేసుకుని అప్లికేటర్ బ్రష్ తో ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించండి.

7. ఒక గంట అలాగే వదిలేయండి.

8. ఆ తరువాత మైల్డ్, సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో హెయిర్ వాష్ చేసుకోండి.

9. ఇలా నెలకి ఒకసారి చేయవచ్చు.

సైనస్ ప్రాబ్లం వుంటే వాతావరణాన్నిబట్టి హెన్నా పెట్టుకుంటే బెటర్. ఆడ, మగ తేడా లేకుండా అన్ని వయసుల వారు దీనిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. బజారులో దొరికే కెమికల్స్ డైలకు దూరంగా వుండటం ఎంతో మంచిది.

Tags:    

Similar News