Monsoon Health Tips: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తప్పనిసరిగా తినాలి!

వర్షాకాలం వచ్చేసరికి చాలా మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. దీకి కారణం వాతావరణ మార్పులతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Update: 2025-09-29 05:00 GMT

Monsoon Health Tips: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తప్పనిసరిగా తినాలి!

వర్షాకాలం వచ్చేసరికి చాలా మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. దీకి కారణం వాతావరణ మార్పులతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా బజ్జీలు, సమోసాలు, ఫ్రైడ్ ఐటమ్స్ తినాలని అనిపించినా, ఇవి తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణం కావు. ఫలితంగా గ్యాస్, అజీర్ణం, కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా వర్షాకాలంలో బయటి ఆహారం తినకూడదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రోడ్డుపక్కన దొరికే పానీపూరీ, చాట్ ఐటమ్స్ వంటివి తింటే విరేచనాలు, పచ్చకామెర్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలాగే బయట నీరు తాగకుండా, ఇంట్లో ఉడికించిన లేదా ఫిల్టర్ చేసిన నీరు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు.

తినవలసిన ఆహారాలు:

ఇంట్లో పరిశుభ్రంగా వండిన వేడి ఆహారం

తాజా పండ్లు, కూరగాయలు

ధాన్యాలు, మొలకలు

బాదం, ఇతర డ్రై ఫ్రూట్స్

దూరంగా ఉండవలసినవి:

నూనెలో వేయించిన పదార్థాలు

నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు

స్ట్రీట్ ఫుడ్

రోగనిరోధక శక్తి పెంచడానికి:

పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి శరీరానికి రక్షణను అందిస్తాయి.

ఇలా ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా మార్చుకుంటే వర్షాకాలంలో అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చు.

Tags:    

Similar News