Milk: పాలలో ఇవి కలుపుకొని తింటే కండరపుష్టి.. బ్రెయిన్ షార్ప్‌..?

Milk: పాలలో ఇవి కలుపుకొని తింటే కండరపుష్టి.. బ్రెయిన్ షార్ప్‌..?

Update: 2022-02-13 15:00 GMT

Milk: పాలలో ఇవి కలుపుకొని తింటే కండరపుష్టి.. బ్రెయిన్ షార్ప్‌..?

Milk: పాలు తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయని అందరికీ తెలిసిందే. చాలా మంది తెల్లటి పాలను తాగుతారు. ఇందులో క్యాల్షియం, పొటాషియం, ప్రొటీన్, విటమిన్ డి, ఫాస్పరస్, సోడియం మెండుగా ఉంటాయి. పాలని సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పుట్టినప్పటి నుంచి పాలు అందరికి మొదటి ఆహారం. పాలు మీ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. కాబట్టి పాలలో ఏయే పదార్థాలను కలుపుకుని తాగితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

పాలు, బాదం పప్పులు

బాదం, పాలు రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాదంపాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలామంచిది, కండరపుష్టిని పెంచుతుంది. బ్రెయన్‌ షార్ప్‌ అవుతుంది. పాలలో కాల్షియం, పొటాషియం, ప్రొటీన్, విటమిన్ డి, ఫాస్పరస్, సోడియం ఉంటాయి. బాదంలో కాల్షియం, విటమిన్ ఈ, ఐరన్, మెగ్నీషియం, వంటి పోషకాలు ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

పసుపు పాలు

పసుపు పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రాచీన కాలంనుంచి ఈ పద్దతిని అవలంభిస్తు్న్నారు. పసుపు పాలలో పోషకాలతో పాటు చెడు బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మీ మూత్రం, ఊపిరితిత్తులు, గుండె, కాలేయానికి సంబంధించిన సమస్యలను తొలగించడంలో సూపర్‌గా పనిచేస్తుంది.

పాలు, తేనె

పాలలో తేనె కలుపుకుంటే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. పాలలాగే తేనె కూడా సద్గుణాల గనిగా చెబుతారు. విటమిన్ బి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్, విటమిన్ ఎ, డి వంటి పోషకాలు తేనెలో ఉంటాయి. ఈ పోషకాలన్నీ మీ శరీరానికి చాలా అవసరం.

Tags:    

Similar News