Menstruation Pills: పీరియడ్స్ కంట్రోల్ పిల్స్ వాడితే దుష్ప్రభావాలు ఏంటి..?
ఈ రోజుల్లో చాలా మంది మహిళలు పీరియడ్స్‌ను వాయిదా వేసుకోవడం కోసం లేదా నియంత్రించుకోవడం కోసం టాబ్లెట్లు వాడుతున్నారు. ట్రిప్ ఉండటం, ఫంక్షన్‌కి హాజరవ్వడం, గుడికి వెళ్లడం వంటి కారణాల వల్ల ఈ మాత్రలను తీసుకుంటున్నారు. అయితే వీటి వెనుక ఉన్న అసలు ప్రమాదాలను చాలా మంది పట్టించుకోరు.

ఈ మాత్రల్లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. ఇది గర్భసంచి పొరను (Uterine lining) నిలబెట్టడానికి సహాయపడుతుంది. మాత్రలు వాడుతున్నంత వరకు పీరియడ్స్ రావు. కానీ ఒకసారి ఆపేస్తే బ్లీడింగ్ మొదలవుతుంది. ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ i-Pillలో కూడా ఇదే హార్మోన్ ఉంటుంది. కానీ ఆ మాత్ర అనుకోని సంబంధాల తర్వాత మాత్రమే వాడాలి. తరచూ వాడితే ఆరోగ్యానికి హానికరం.
తరచుగా వాడితే వచ్చే సమస్యలు:
రుతుక్రమం పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది
పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా మారుతాయి
బ్లోటింగ్ (ఉబ్బరం), వాటర్ రిటెన్షన్
శరీరం బరువుగా, నీరసంగా అనిపించడం
డాక్టర్ల ప్రకారం ఇవన్నీ హార్మోన్ల దుష్ప్రభావాలే. ముఖ్యంగా ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ మాత్రలు తరచూ వాడితే భవిష్యత్తులో ఫెర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి పీరియడ్స్ కంట్రోల్ పిల్స్ వాడే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.