Late Night Eating : రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారా? మీకు డేంజర్ బెల్స్ మోగినట్లే
Late Night Eating : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, అర్ధరాత్రి వరకు మొబైల్ వాడకం, మారుతున్న జీవనశైలి కారణంగా చాలామందికి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం ఒక అలవాటుగా మారిపోయింది.
Late Night Eating : రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారా? మీకు డేంజర్ బెల్స్ మోగినట్లే
Late Night Eating : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, అర్ధరాత్రి వరకు మొబైల్ వాడకం, మారుతున్న జీవనశైలి కారణంగా చాలామందికి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. పగలు తినడానికి సమయం లేకపోయినా, రాత్రికి తీరికగా తిందాంలే అనుకుంటారు. కానీ ఈ చిన్న పొరపాటే మీ ప్రాణాల మీదకు తీసుకురావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అసాధారణంగా పెరుగుతాయని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం ఒక్క రోజుతో పోయే సమస్య కాదు, దీర్ఘకాలంలో మీ ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.
సాధారణంగా మన శరీరం పగటిపూట ఆహారాన్ని అరిగించుకోవడానికి, దానిని శక్తిగా మార్చుకోవడానికి అనువుగా పనిచేస్తుంది. కానీ రాత్రి అయ్యే కొద్దీ మెటబాలిజం నెమ్మదిస్తుంది. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మనం రాత్రిపూట ఆహారం తీసుకున్నప్పుడు శరీరం దానిని ప్రాసెస్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. పగటితో పోలిస్తే రాత్రిపూట ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం తిన్న ఆహారం వెంటనే శక్తిగా మారకుండా, రక్తంలో గ్లూకోజ్ రూపంలో ఉండిపోతుంది. ముఖ్యంగా రాత్రిపూట స్వీట్లు లేదా ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకుంటే షుగర్ లెవల్స్ రాకెట్ వేగంతో దూసుకుపోతాయి.
షుగర్ లేని వారికి కూడా ముప్పే
చాలామంది తమకు షుగర్ లేదు కదా, ఎప్పుడు తింటే ఏమవుతుందిలే అని ధీమాగా ఉంటారు. కానీ ఇది చాలా తప్పుడు ఆలోచన. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా నిత్యం ఆలస్యంగా భోజనం చేసే అలవాటు పెట్టుకుంటే, భవిష్యత్తులో వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు 70 శాతం పెరుగుతాయి. ఇలా చేయడం వల్ల శరీరంలోని సహజ షుగర్ కంట్రోల్ సిస్టమ్ బలహీనపడుతుంది. క్రమంగా ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రభావం పడి, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు దారితీస్తుంది. ఫలితంగా మీరు అతి తక్కువ వయసులోనే షుగర్ బారిన పడాల్సి వస్తుంది. దీనితో పాటు ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు కూడా చుట్టుముడతాయి.
ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి?
రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రశాంతమైన నిద్ర పొందడానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. రాత్రి పడుకోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందే భోజనం ముగించడం ఉత్తమం. భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కొద్దిసేపు ఇంట్లోనే అటు ఇటు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాత్రిపూట వేపుళ్లు, మసాలా దట్టించిన పదార్థాలు, స్వీట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీలైనంత వరకు రాత్రి 8 గಂಟల లోపే భోజనం ముగించేలా ఒక టైమ్ టేబుల్ సెట్ చేసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.