Health Tips: మామిడిపండ్లు తిన్న వెంటనే వాటర్‌ తాగుతున్నారా.. ఆస్పత్రికి వెళ్లడానికి రెడీగా ఉండండి..!

Health Tips: ఎండాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్‌లో మామిడిపండ్ల వాసన మొదలవు తుంది.

Update: 2024-05-07 16:00 GMT

Health Tips: మామిడిపండ్లు తిన్న వెంటనే వాటర్‌ తాగుతున్నారా.. ఆస్పత్రికి వెళ్లడానికి రెడీగా ఉండండి..!

Health Tips: ఎండాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్‌లో మామిడిపండ్ల వాసన మొదలవు తుంది. ఇక మామిడి ప్రియులను ఆపడం మనతరం కాదు. ఎందుకంటే మామిడి పండ్లలోనే రారాజు. దీనిని చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పేరుకు తగ్గట్టుగానే ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాపర్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే మామిడిపండ్లు తిన్న వెంటనే ఎప్పుడు వాటర్‌ తాగవద్దు. దీనివల్ల జరిగే అనర్థాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఎండాకాలంలో మామిడి పండు తిన్న తర్వాత చాలామంది వెంటనే వాటర్‌ తాగుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. దీనివల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు ఏర్పడు తాయి. పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మామిడిపండు తిన్న గంట తరువాత మంచి నీటిని తాగవచ్చు. అయితే గ్రామాల్లో చాలామందికి ఈ విషయంపై అవగాహన ఉండదు. దీనివల్ల వారు చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వీటికి కారణం మామిడి పండ్లు తినడమే అని భావించి వాటిని తినడం మానేసేవారు కూడా కొందరు ఉంటారు.

అలాగే మామిడి పండ్లతో పెరుగు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండూ కలిసి కడుపు సమస్యలు, జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తాయి. మామిడి పండ్లతో కలిపిన లేదా తిన్న స్పైసీ ఫుడ్ తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అందుకే వాటిని ఎప్పుడూ కలిపి తినకూడదు. ఆయుర్వేదం ప్రకారం కాకరకాయ వంటి ఆహారాలను తిన్న తర్వాత మామిడికాయ, లేద పండ్లు తినటం వల్ల వికారం, వాంతులు సంభవిస్తాయి.

Tags:    

Similar News