Kidney Damage: కిడ్నీలు పాడవుతే ఉదయం పూట ఈ 5 లక్షణాలు కనిపిస్తాయట..
Kidney Damage Symptoms In Morning: మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి మన శరీరంలోని విష పదార్థాలను ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తాయి.
Kidney Damage Symptoms In Morning
Kidney Damage Symptoms In Morning: మన శరీరంలో పీహెచ్, ఉప్పు, పొటాషియంను నిర్వహించాలంటే మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి, అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం కిడ్నీలు పనితీరు, మందగిస్తే కొన్ని లక్షణాలు ఉదయం పూట కనిపిస్తాయి. దీంతో మీరు కిడ్నీల ప్రమాదాల బారిన పడ్డట్టే. ప్రధానంగా షుగర్ వ్యాధిగ్రస్తులు కిడ్నీ ప్రమాదాల బారిన ఎక్కువ పడతారు.
ఉదయం మీరు లేచిన వెంటనే ముఖం వాచినట్టుగా కనిపిస్తుంది. దీంతో మీ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. కేవలం ముఖం మాత్రమే కాదు.. పాదాలు కూడా వాపు కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయకపోవడం వల్ల వ్యర్థ ఉత్పత్తులు బ్లడ్ లో కలిసినప్పుడు ఇలా జరుగుతుంది. ఎక్కువగా ప్రోటీన్ యూరిన్‌లోకి లీక్ అయినప్పుడు ఇలా వాపు ముఖంపై కనిపిస్తుంది.
అంతేకాదు ఉదయం యూరిన్ వెళ్ళినప్పుడు మబ్బుగా ఉంటుంది. బబుల్స్ కనిపిస్తాయి. ఈ లక్షణం కూడా మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెబుతాయి.
కొంతమందిలో తరచూ డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతుంటారు. వారి చర్మం త్వరగా పొడిబారిపోతుంది. విషపదార్థాలు వ్యర్ధాలు చెమటలోకి కలిసి పోవడం వల్ల చర్మం పొడిబారి పోతుంది. దీంతో అతిగా దురదలు వస్తాయి. అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. మీరు ఎంత మాయిశ్చరైజ్ చేసినా కానీ ఈ లక్షణాలు అలాగే ఉంటాయి. ఇది కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుందని చెప్పవచ్చు.
ఇక మీ కిడ్నీ పనితీరు కుంటుపడిందని చెప్పే మరో లక్షణం ఏకాగ్రతను కోల్పోవడం. ఎర్ర రక్త కణాలు త్వరగా తగ్గిపోతూ ఉంటాయి. బ్రెయిన్ ఫాగ్, నీరసం తరచూ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కిడ్నీ పాడయ్యాయని సూచించే లక్షణాలు.
కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఉదయం పూట నోటి దుర్వాసన కాస్త విచిత్రంగా వస్తుంది. అప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. విషపదార్థాలు మన రక్తంలో కలిసినప్పుడు ఇలా నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుందని వైద్యులు చెబుతారు.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి .ఇంకా డయాబెటిస్ బారిన పడిన వారికి ఈ కిడ్నీ ప్రమాదం త్వరగా వస్తుంది. ఎక్కువ రోజులపాటు బీపీ, డయాబెటీస్‌తో బాధపడుతున్న వారిలో ప్రధానంగా కనిపిస్తాయి. ఈ కిడ్నీల పనితీరు కుంటు పడితే రాను రాను డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.