Tooth Brush: బాత్రూమ్‌లో టూత్ బ్రష్ పెడుతున్నారా? ఐతే మీకీ డేంజర్ తెలుసా?

Update: 2025-02-07 10:10 GMT

Tooth Brush: బాత్రూమ్‌లో టూత్ బ్రష్ పెడుతున్నారా? ఐతే మీకీ డేంజర్ తెలుసా?

Are you keeping your Teeth brush in bathroom: కొన్నిసార్లు ఇందులో ఏముందిలే అని లైట్ తీసుకునే విషయాలే మనకు తెలియకుండానే భారీ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా ఒకటి. టూత్ బ్రష్ వాడేందుకు కూడా ఒక పద్దతి ఉంటుందని తరచుగా డెంటిస్టులు చెబుతుంటారు. తాజాగా సిద్ధిపేట గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ స్టూడెంట్స్ చేసిన అధ్యయనంలోనూ మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకొచ్చింది.

ప్రతీరోజూ ఉదయం శుభ్రంగా దంతాలు తోమగానే బాత్రూంలోనే టూత్ బ్రష్ పెట్టేసి బయటకొచ్చే అలవాటు చాలా మందిలో ఉంటుంది. టూత్ బ్రష్ పెట్టుకోవడానికి వాష్ రూమ్‌లో సింక్ పక్కనే అందుకు ఆధునిక ఏర్పాట్లు కూడా ఉంటాయి. చాలామంది ఇది ఒక సౌకర్యంగా భావిస్తుంటారు. "కానీ బాత్ రూమ్‌లో టూత్ బ్రష్ పెట్టడం అంటే క్రీములతో బ్రషింగ్ చేయడమే" అని మీకు తెలుసా? లేకపోతే ఇదిగో ఈ న్యూస్ మీకోసమే.

బాత్ రూమ్ ఎంత రెగ్యులర్‌గా క్లీన్ చేసినప్పటికీ అక్కడ బాక్టీరియా ఉంటుంది. పరిశుభ్రత పాటించకపోతే అక్కడ ఇంకా ఎక్కువ బాక్టీరియా ఉంటుంది. అలాంటి చోట టూత్ బ్రష్ పెడితే, ఆ టూత్ బ్రష్‌కు క్రీములు పట్టుకునే ప్రమాదం ఉంది. అదే టూత్ బ్రష్‌తో మరుసటి రోజు మళ్ళీ బ్రషింగ్ చేసినప్పుడు ఆ బాక్టీరియా వారి నోట్లోకి ప్రవేశించే ప్రమాదం కూడా ఉంది.

మరీ ముఖ్యంగా ఒకే టూత్ బ్రష్ స్టాండ్‌లో మూన్నాలుగు, లేదంటే నాలుగైదు టూత్ బ్రష్‌లు పెడుతుంటారు. ఇంట్లో ఎంతమంది కుటుంబసభ్యులు ఉంటే అంతమందికి అక్కడే టూత్ బ్రష్ పెట్టే అలవాటు వల్ల అలా జరుగుతుంది. అలాంటప్పుడు ఆ టూత్ బ్రష్‌లు ఒకదానికొకటి తగలడం వల్ల బాక్టీరియా వ్యాప్తి రిస్క్ ఇంకా ఎక్కువ గా ఉంటుంది.

సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎడ్యుకేషన్ డెస్క్‌కు సంబంధించిన జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

టాయిలెట్ ఉపయోగించిన తర్వాత ఫ్లష్ చేసేటప్పుడు ఎగిరిపడే నీటి తుంపర్లు, గాలి ద్వారా బాత్రూమ్‌లోని మిగతా ప్రాంతాల్లోకి బ్యాక్టీరియా వ్యాపిస్తుందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం సిద్దిపేటలోనే 100 శాంపిల్స్ సేకరించి మరీ ల్యా‌బ్‌లో మైక్రోబయాల్ టెస్ట్ చేశారు.

ఈ అధ్యయనం ఫలితాలను విశ్లేషించి చూస్తే నిజంగానే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. అన్ని టూత్ బ్రష్‌లలోనూ బాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లుగా తేలింది.

అందులో అత్యధికంగా స్ట్రెప్టోకోకస్ మ్యుటల్స్ అనే బ్యాక్టీరియా 50% వరకు, స్టెఫీలోకోకస్ ఆరియాస్ అనే బాక్టీరియా 40% వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈశ్చెరిచియా కోలి అనే మరో రకం బ్యాక్టీరియా కూడా వ్యాపిస్తున్నట్లు వెల్లడైంది.

టూత్ బ్రష్‌ను శుభ్రంగా క్లీన్ చేయకపోయినా, లేదా శుభ్రమైన ప్రదేశంలో పెట్టకపోయినా అది బాక్టీరియాకు నిలయంగా మారుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన మైక్రో బయాలజీ విభాగం అధిపతి మదన్ మోహన్ తెలిపారు.

టూత్ బ్రష్ కు బ్యాక్టీరియా వ్యాపించకుండా ఏం చేయాలి?

1) ముందుగా వాష్ రూమ్‌లో టూత్ బ్రష్ పెట్టే అలవాటుకు గుడ్ బై చెప్పాలి.

2) ప్రతీ 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చుతూ ఉండాలి. ఒకవేళ టూత్ బ్రష్ అరిగిపోవడం, లేదా పాడవడం జరిగితే, అంతకంటే ముందే టూత్ బ్రష్‌ను మార్చేయాలి.

3) గాలి, వెలుతురు సరిగ్గా ఉండి, పొడిగా ఉండే ప్రదేశంలో టూత్ బ్రష్‌ను పెట్టాలి.

4) వెనిగర్, సబ్బు వంటి వాటితోనూ టూత్ బ్రష్ క్లీన్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News