Japanese Girls: అందమంటే జపాన్ అమ్మాయిలదే.. వాళ్ల ఫుడ్డే వాళ్లను అంత అందంగా ఉంచుతుందా?

Japanese Girls: జపాన్ అమ్మాయిలను చూసినా, మహిళలను చూసినా అందరూ ఒకేలా కనిపిస్తారు. వారి వయసు వారి ముఖాలపై ఎక్కడా కనిపించదు. అందంతో పాటు మంచి ఆరోగ్యం జపాన్ అమ్మాయిల సొంతం.

Update: 2025-06-19 16:30 GMT

Japanese Girls: అందమంటే జపాన్ అమ్మాయిలదే.. వాళ్ల ఫుడ్డే వాళ్లను అంత అందంగా ఉంచుతుందా?

జపాన్ అమ్మాయిలను చూసినా, మహిళలను చూసినా అందరూ ఒకేలా కనిపిస్తారు. వారి వయసు వారి ముఖాలపై ఎక్కడా కనిపించదు. అందంతో పాటు మంచి ఆరోగ్యం జపాన్ అమ్మాయిల సొంతం. అయితే జపాన్ అమ్మాయిలు ఎందుకంత అందంగా ఉంటారు? ఎందుకంత ఆరోగ్యం ఉంటారు? అంటే వారి ఆహారపు అలవాట్లే వారిని అంత అందంగా ఉంచుతుంది.

జపాన్ సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. జపనీస్ కల్చర్‌‌ని ఇష్టపడని వారు ఉండరు. ఎందుకంటే వాళ్ల కల్చర్ లో మంచి పద్దతులు ఉంటాయి. మంచి ఆహారపు అలవాట్లు ఉంటాయి. అందుకే వారు ఎంత వయసు వచ్చినా చిన్న వయసు ఉన్నట్లే కనిపిస్తారు.

సీ ఫుడ్

చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇంకా అందులో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ కూడా అధిక సంఖ్యలో ఉంటాయి. పైగా చేపట్లు శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఇంత మేలు చేసే సీ ఫుడ్‌ని మనం వారానికి ఒక్కసారి కూడా తినం. కానీ జపాన్ వాళ్లు ప్రతి రోజు ఆహారంలో చేపలు ఉండేలా చూసుకుంటారు. చేపలతో తయారుచేసిన కొన్ని జపనీస్ వంటలు రెస్టారెంట్లలో చాలా ఫేమస్ కూడా. స్వీడ్ ఫిష్, సాల్మన్, షెల్ ఫిష్, ఈల్, ఆక్టోపస్, ట్యూనా వంటి ఎన్నో రకాల సీఫుడ్‌ని వాళ్లు లంచ్, డిన్నర్‌‌లతో తింటారు. ఇలా రోజూ సీఫుడ్ తినడం వల్ల వాళ్ల చర్మం షైనీగా మారుతుంది.

పులిసిన ఆహారం

చాలామంది పులిసిన ఆహారం తింటే ఆరోగ్యం పాడైపోతుందని అంటారు. కానీ జపాన్ వాళ్లు పులియబెట్టుకున్న ఆహారాన్ని తింటారు. ఎందుకంటే పులియ బెట్టిన ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, ప్రొబయోటిక్స్ ఉంటాయి. అంటే వీరు ప్రతి ఆహారాన్ని పులియబెట్టి తినరు. సోయాబీన్స్ తో పులియబెట్టిన ఆహారాన్ని మాత్రమే తింటారు. అది కూడా దానికి అనుగుణంగా తయారుచేసుకుంటారు. ఇది ఇమ్యూనిటీని పెంచడంతో పాటు క్యాన్సర్ కారకాలను పెరగకుండా చేస్తుంది. అంతేకాదు ఈ పులియ బెట్టిన సోయా బీన్ ఆహారం తినడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు ఉండవు. ఉన్నా అవి తగ్గిపోతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ ని రెగ్యులర్ గా తాగితే అందం మరింత రెట్టింపు అవుతుందని జపాన్ వాళ్లు నమ్ముతారు. ఉదయం, సాయంత్రం వేళలో గ్రీన్ టీని తాగడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. పైగా ఈ గ్రీన్ ఎటువంటి ఆహారం తిన్నా అది అరిగేలా చేస్తుంది. అదేవిధంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం, గుండె పనితీరును పెంచడం వంటివి ఈ గ్రీన్ టీ చేస్తుంది.

జపాన్ వాళ్ల ఆహారం తింటే జపాన్ వాళ్లు అందంగా మారుతున్నట్టే.. మన తెలుగు రాష్ట్రాల్లో దొరికే ఆహారం తింటే తెలుగు వాళ్లు కూడా అందంగా మారే అవకాశం ఉంది. అలాకాకుండా ఫాస్ట్ ఫుడ్, బయట దొరికే ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ముఖంపై మడతలు తొందరగా వస్తాయి. అందుకే ఇంటి ఫుడ్ బెస్ట్ ఫుడ్.

Tags:    

Similar News