Jamun Seeds: నేరేడుపండుని తిని గింజలను పడేయకండి.. ఎందుకంటే.. మీరు లక్షల రూపాయలు ఆదా చేయొచ్చు..!

Jamun Seeds: పండ్లు తింటే పదికాలాల పాటు పదిలంగా ఉంటామన్న నానుడి ఊరికే రాలేదు. సీజనల్‌గా దొరికే ఏ పండైనా ఆరోగ్యానికి మంచిదే.

Update: 2025-06-19 07:00 GMT

Jamun Seeds: నేరేడుపండుని తిని గింజలను పడేయకండి.. ఎందుకంటే.. మీరు లక్షల రూపాయలు ఆదా చేయొచ్చు..!

Jamun Seeds: పండ్లు తింటే పదికాలాల పాటు పదిలంగా ఉంటామన్న నానుడి ఊరికే రాలేదు. సీజనల్‌గా దొరికే ఏ పండైనా ఆరోగ్యానికి మంచిదే. అయితే ఈ సీజన్‌లో దొరికే నేరేడు పండ్లు తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే మీరు పండు తిని గింజ పారేస్తున్నారా? అసలు అలా చేయకండి నేరేడు పండులో ఎన్ని పోషకాలు ఉన్నాయో గింజలో అంతకంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. పైగా మీరు ఇలా చేస్తే లక్షలడబ్బులు ఆదా చేయొచ్చు. ఆ వివరాలేంటో ఇప్పడు తెలుసుకుందాం.

నేరేడుపండులో ఎన్నో అద్బుతమైన గుణాలున్నాయి. విటమిన్ సి, ఐరన్, కాల్షియం, పోటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు నేరేడు పండులో ఉన్నాయి. ముఖ్యంగా రోగనిరోధకశక్తిని తగ్గించే గుణం ఈ పండుకి ఉంది. కానీ.. పండులో మాత్రమే కాదు గింజలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ గింజలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. అమ్మమ్మలు, తాతయ్యల కాలం నుంచీ ఈ గింజలను తింటున్నారు. అందుకే వారు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు.

నేరేడుపండు గింజలను తీసుకోవడం వల్ల అందులో ఎక్కువగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ఇక ఎందులోనూ దొరకనంత ఎక్కువగా ఈ గింజల్లో ఇవి దొరుకుతాయి. అందుకే పండును మాత్రమే కాదు గింజలను కూడా తినడం మంచిదని పెద్దవాళ్లు చెబుతున్నారు.

ఎలా తినాలి..

ఏ గింజలనైనా నేరుగా తినకూడదు. వాటిని చూర్ణం చేసుకుని తినాలి. నేరేడుపండ్లు తినేసిన తర్వాత వచ్చిన గింజలను కడిగి,ఎండలో బాగా ఎండ నివ్వాలి. వాటిని స్టవ్‌పై కాస్త వెచ్చగా వేయించాలి. ఆ తర్వాత దాన్ని పొడిలా చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పొడిని ప్రతిరోజూ నీళ్లలో కలిపి పరగడుపున తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే డయాబెటీస్, గుండె జబ్బులు, బీపీ, బాడీ డిటాక్స్ వంటి వ్యాధుల నుండి ఈ చూర్ణం కాపాడుతుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకునేవారు ఈ చూర్ణాన్ని ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ గింజలను చూర్ణం చేసుకుని తింటే ఎన్నో ప్రమాదకరమైన జబ్బులకు దూరంగా ఉండొచ్చు. దీనివల్ల లక్షల రూపాయలను ఆదా చేసుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు.

Tags:    

Similar News