Mango Benefits for Skin: చర్మ సౌందర్యానికి మామిడి గుజ్జు

Update: 2021-03-24 07:14 GMT

Mango పల్ప్:( ఫోటో ది హన్స్ ఇండియా)

Mango Benefits for Skin: వేసవి లో మాత్రమే లభించే సీజనల్ ఫ్రూట్ మామిడి పండు. ఈ పండు ఆరోగ్య ప్రదాయినే కాదండి సౌందర్య కారిణిగా కూడా ఉపయోగపడుతుంది. తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%) చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు, ఎ,బి,సి (A,B,C) విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి చాల ఉపయోగ పడతాయి. ఎందుకంటే మామిడిలోని గుణాలు నల్లమచ్చలను, మొటిమల పోగొట్టి ముఖంలో కొత్తదనం, గ్లోయింగ్ స్కిన్ ను నింపుతుంది. మామిడిలో ఉండే పుష్కలమైన న్యూట్రీషియన్స్, విటమిన్ ఎ మరియు బీటాకెరోటిన్ ఇవన్నీకూడా చర్మానికి రక్షణ కల్పించి అందంగా తీర్చిదిద్దుతుంది. మరి మామిడి పండు ఉపయోగించి చర్మంలో మార్పులు ఎలా తీసుకురావచ్చో మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం...

డెడ్ స్కిన్..

ఒక చెంచా మామిడి పండు గుజ్జులో అర చెంచా పాలు లేదా పాల పౌడర్ మిక్స్ చేసి, తేనె కూడా మిక్స్ ముఖానికి అప్లై చేసి బాగా స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. బ్లాక్ హెడ్స్ తొలగించబడంతో ముఖ్యం మెరుస్తుంటుంది. ఒక చెంచా గోధుమపిండి, కొద్దిగా మామిడి పండు గుజ్జు వేసి రెండింటినీ బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ఇది ఫర్ఫెక్ట్ యాస్ట్రిజెంట్ ను ఉపయోగపడుతుంది. ఇది చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

పచ్చిమామిడి తొక్క తో..

మామిడి డిటానింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. పచ్చిమామిడి తొక్క లేదా పండిన మామిడి తొక్కను ముఖానికి, చేతులకు బాగా రుద్దాలి. అవసరమైతే మిల్క్ క్రీమ్ ఉపయోగించి కూడా స్ర్కబ్ చేయవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని10-15నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయడం వల్ల సన్ టాన్ తొలగిపోతుంది. బాగా పండిన మామిడిపండు గుజ్జులో అర టీస్పూన్ పాలు, రెండు మూడు చుక్కల తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో బాగా మర్ధన చేయాలి . ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో సహాయపడుతుంది. మరియు బ్లాక్ హెడ్స్ ను తొలగించి ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది.

Tags:    

Similar News