Breast Milk: డెలివరీ తర్వాత పాలు పెరగాలంటే ఈ డైట్ ఫాలో అవ్వండి.. డాక్టర్లు చెప్పిన టిప్స్ ఇవే!

Breast Milk: పిల్లలకు తల్లి పాలు అమృతం లాంటివి. పుట్టిన శిశువుకు తల్లి పాలు చాలా ముఖ్యం.

Update: 2025-06-26 07:47 GMT

Breast Milk: డెలివరీ తర్వాత పాలు పెరగాలంటే ఈ డైట్ ఫాలో అవ్వండి.. డాక్టర్లు చెప్పిన టిప్స్ ఇవే!

Breast Milk: పిల్లలకు తల్లి పాలు అమృతం లాంటివి. పుట్టిన శిశువుకు తల్లి పాలు చాలా ముఖ్యం. అందులో పిల్లల పెరుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. తల్లి పాలు పిల్లల రోగనిరోధక శక్తిని పెంచి, జబ్బుల నుంచి కాపాడుతాయి. పాలల్లో ఉండే యాంటీబాడీలు పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు బాగా సహాయపడతాయి. ఇవి పిల్లలకు మాత్రమే కాదు, తల్లులకు కూడా చాలా మంచివి. ఎందుకంటే, పాలివ్వడం వల్ల తల్లుల బరువు అదుపులో ఉంటుంది. గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి, డెలివరీ తర్వాత తల్లులకు తగినంత పాలు ఉత్పత్తి అవ్వడం చాలా అవసరం. దీనికోసం కొన్ని ప్రత్యేక పద్ధతులు, ఆహార నియమాలు పాటించవచ్చు. ఇవి సహజంగా పాలు పెరగడానికి సహాయపడతాయి. అవేంటో ఈ వార్తలో తెలుసుకుందాం.

పాలు పెంచడానికి సులువైన పద్ధతులు:

తరచుగా పాలు పట్టడం: తల్లి పాలు పెరగడానికి ఇది చాలా సులువైన, బాగా పనిచేసే పద్ధతి. ప్రతి 2-3 గంటలకు ఒకసారి బిడ్డకు పాలు పట్టండి. రాత్రిపూట కూడా పాలు పట్టడం మానొద్దు. ఇలా చేయడం వల్ల శరీరానికి ఎక్కువ పాలు అవసరమని సంకేతం వెళ్లి, సహజంగానే పాల ఉత్పత్తి పెరుగుతుంది.

పవర్ పంపింగ్: ఇది మరొక ఎఫెక్టివ్ పద్ధతి. ఇందులో ముందు 20 నిమిషాలు పంప్ చేయాలి. ఆ తర్వాత 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. మళ్లీ 10 నిమిషాలు పంప్ చేసి, 10 నిమిషాలు ఆగి, చివరిగా మరో 10 నిమిషాలు పంప్ చేయాలి. ఈ పద్ధతిని రోజుకు ఒకసారి వరుసగా 2-3 రోజులు పాటిస్తే పాల ఉత్పత్తిలో మెరుగుదల కనిపిస్తుంది.

మసాజ్: ప్రతిసారి పాలు పట్టే ముందు రొమ్ములను మెల్లగా మసాజ్ చేయండి. దీనివల్ల పాల నాళాలు తెరుచుకుని, పాలు తేలికగా వస్తాయి.

రెండు వైపులా పాలు పట్టండి: బిడ్డకు రెండు రొమ్ముల నుండి పాలు పట్టండి. దీనివల్ల రెండు వైపులా పాల ఉత్పత్తి సమతుల్యంగా ఉంటుంది.

బిడ్డతో ఎక్కువ సమయం గడపండి : తల్లి, బిడ్డ ఒకరినొకరు తాకుతూ ఎక్కువ సమయం గడపడం, ప్రశాంతమైన వాతావరణం, తగినంత నిద్ర కూడా పాల ఉత్పత్తిని పెంచుతాయి.

పాలు పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

పాలిచ్చే తల్లి తీసుకునే ఆహారం పాల పరిమాణం, నాణ్యతపై నేరుగా ప్రభావం చూపుతుంది. తగినంత పాల ఉత్పత్తి కోసం, తల్లికి రోజుకు దాదాపు 500 అదనపు కేలరీలు అవసరం. అందుకోసం..

శతావరి: ఇది ఒక ఆయుర్వేద మూలిక. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. పాల ఉత్పత్తిని పెంచుతుంది.

మోరింగా పౌడర్ (మునగాకు పొడి): ఇందులో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది తల్లికి, బిడ్డకు ఇద్దరికీ మేలు చేస్తుంది.

మెంతులు, బార్లీ గంజి, సోంపు, వాము : ఇవన్నీ కూడా పాల ఉత్పత్తిని పెంచడంలో బాగా సహాయపడతాయి.

పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, పన్నీర్ వంటి వాటిని రోజువారీ ఆహారంలో తీసుకోవాలి.

డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి.

తాజా పండ్లు, ఆకుకూరలు: కాలానుగుణంగా లభించే పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు తప్పకుండా తినండి.

నీరు, పానీయాలు: శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి, రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగండి. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు వంటి హెల్తీ డ్రింక్స్ కూడా తీసుకోండి.

Tags:    

Similar News